Begin typing your search above and press return to search.

వికాస్ దుబే నెల సంపాదన కోట్లలో.. అకౌంట్లు ఖాళీగా

By:  Tupaki Desk   |   15 July 2020 2:30 AM GMT
వికాస్ దుబే నెల సంపాదన కోట్లలో.. అకౌంట్లు ఖాళీగా
X
ఉత్తర ప్రదేశ్ రౌడీ షీటర్.. ముఠా నాయకుడు.. వికాస్ దుబే ఎన్ కౌంటర్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్‌ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను జూలై 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వికాస్ దుబే ఎన్ కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఈడీ విచారణ కొనసాగిస్తూనే ఉంది.

ఈ విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వికాస్ దుబే నెలకు రూ. కోటి వరకు సంపాదించేవాడని విచారణలో తేలింది. ప్రతి నెల 90 లక్షల నుంచి 1.2 కోట్ల వరకు సంపాదించే దుబే, ఆ డబ్బును ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈడీ విచారణ పూర్తవ్వాల్సిందే. ఈ సంపాదన అంతా ఎలా ఖర్చు చేసేవాడు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే తాగుడు అలవాటు కూడా లేని వికాస్ దూబే అంత మొత్తంలో ఉన్నా కూడా ఒక సాధారణమైన జీవితాన్ని గడిపేవాడని.. ఆడంబరమైన దుస్తులను కూడా ధరించేవాడని తెలిసింది. ఈ విధంగా అతడికి సంబంధించిన ఒక్కో విషయం ఆసక్తికరంగా మారింది. విదేశీ ప్రయాణాలకు కూడా దూరంగా ఉండేవాడని తెలిసింది.

ఇలా నిరాడంబర జీవితం గడిపిన అతడు ఆ సంపాదన ఏం చేశాడని ఆసక్తికరంగా మారింది. మరి అతడి సంపాదన ఏమైంది? ఎక్కడెక్కడ ఆస్తి ఉందనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం వికాస్ దుబేకు వికాస్ బ్యాంకు ఖాతాలో కూడా పెద్ద మొత్తంలో నిల్వలు లేవని విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడు బినామీ ల పేరిట ఏమైనా బ్యాంకుల్లో నిల్వలు ఉంచారేమోనని అధికారులు వికాస్ దుబే సన్నిహితులు.. బంధువుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ప్రతినెల భారీ డబ్బులు వస్తున్నా ఏం చేశారని ఈడీ దర్యాప్తు చేస్తోంది.