మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన ఈసీ

Thu Apr 22 2021 20:25:37 GMT+0530 (IST)

EC respond to municipal elections

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై వివాదం రాజుకుంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదం అని.. నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారని.. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు.అయితే కోర్టు ఈ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విన్నవించాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత నిచ్చారు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతథంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు.ఈనెల 30న 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని.. ప్రభుత్వ సూచన మేరకు యథావిధిగా ఎన్నికలు నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు.లంచ్ మోషన్ పిటీషన్ ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు.  ఎన్నికల కమిషన్ కు మరోసారి విన్నవించాలని పిటీషనర్ కు చీఫ్ జస్టిస్ సూచించారు. అయితే ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపింది.