Begin typing your search above and press return to search.

గ్రేటర్ పోరు : కరోనా పేషేంట్స్ ఏ సమయంలో ఓట్లు వేయాలంటే ?

By:  Tupaki Desk   |   21 Nov 2020 5:40 PM GMT
గ్రేటర్ పోరు : కరోనా పేషేంట్స్ ఏ సమయంలో ఓట్లు వేయాలంటే ?
X
గ్రేటర్ లో ఎన్నికల పోరు ... రాజకీయ రణరంగాన్ని తలపిస్తుంది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలన్ని కూడా బరిలోకి దిగడంతో గట్టి పోటీ ఉండబోతుంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తుండటం తో ఎలక్షన్ కమిషన్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. తాజాగా ఈసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు హక్కు కలిగిన వికలాంగులకు, 80 ఏళ్లు పైబడినవారు, కరోనా మహమ్మారి పాజిటివ్ పేషెంట్లకు ఈ సారి ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఒకవేళ వికలాంగులు, వృద్దులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వెయ్యాలని భావిస్తే, వారి కోసం ప్రత్యేక ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా నియమించాలని వెల్లడించింది. ఇక వికలాంగులు, వయస్సు పైబడినవారు, పసిపిల్లల తల్లులు క్యూలైన్‌ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేసే సౌలభ్యాన్ని కల్పించింది. ఇక కరోనా బాధితులు కూడా మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.