ద్వివేది సంతకం ఫోర్జరీ..రూ.3.50 కోట్లు వసూలు వెలుగులోకి ఘరానామోసం !

Thu Jun 10 2021 19:00:01 GMT+0530 (IST)

Dwivedi signature forgery: Rs 3.50 crore collected

ఏపీలో ఇసుక వ్యవహారం పై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇసుక పాలసీ పై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ఈ పర్మిట్ల ద్వారా ఇసుక తవ్వకాలకు ఈ పర్మిట్ ను తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఇదే తరుణంలో ఏపీలో ఇసుక రీచ్ ల పేరుతొ చోటు చేసుకున్న భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఇసుక రీచుల్లో తవ్వకాలు సబ్ లీజులు ఇస్తామని 3.50 కోట్లు వసూలు చేసిన కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది.  ఇసుక రీచుల్లో తవ్వకాలు లీజుకు ఇస్తామని ఓ కేటుగాడు రూ.3.50 కోట్లు వసూలు చేశాడు. గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేశాడు. ఏపీలో ఇసుక రీచుల వేలాన్ని ఏపీ ప్రభుత్వం జేపీ గ్రూప్‍కి ఇచ్చింది. నిందితుడు కాకినాడకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. 2018లో సైఫాబాద్‍ లో నిందితుడిపై ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఫోర్జరీపై కేసు నమోదైంది. ఏడుగురు బాధితుల నుంచి రూ.3.50 కోట్లు వసూలు చేశాడు. బెజవాడ భవానీపురంలో ఎఫ్‍ ఐఆర్ నమోదైంది. నిందితుడి బ్యాంకు అకౌంట్ నుంచి పోలీసులు రూ.2 కోట్లు సీజ్ చేశారు.
 
దీనిని గుర్తించి..అధికారులతో చర్చించిన జేపీ గ్రూప్ మేనేజర్ హర్ష కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. బెజవాడ భవానీ పురం లో FIR నమోదు అయింది. నిందితుడి పైన 471 420 465 469 471 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. విచారణ చేసిన పోలీసులు నిందితుడు బ్యాంకు ఖాతా నుండి రెండు కోట్లు సీజ్ చేసారు. విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విధానం అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అనుమతి పొందిన జేపీ పవర్ వెంచర్స్ తవ్వకాలకు సంబంధించి ఈ పర్మిట్ పొందాలి. దీని కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారు కోరిన ప్రాంతంలోని గనుల శాఖ సహాయ సంచాలకుల ద్వారా వాటి పరిశీలన అననుమతి వెంటనే లభించేలా ఈ విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా ఎక్కడ..ఎంత మేర మైనింగ్ జరిగిందనేది ప్రభుత్వం వద్ద పక్క లెక్కలు..సమాచారం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా జరిగిన ఫోర్జరీ వ్యవహారంతో ప్రభుత్వంలోని ఐటీ విభాగం మరింతగా అప్రమత్తంగా ముందుకు సాగుతుంది.