Begin typing your search above and press return to search.

జపానోడి తెలివే తెలివి.. ఆటగాళ్లు సెక్సు చేయకుండా కొత్త ఎత్తు

By:  Tupaki Desk   |   19 July 2021 8:30 AM GMT
జపానోడి తెలివే తెలివి.. ఆటగాళ్లు సెక్సు  చేయకుండా కొత్త ఎత్తు
X
మిగిలిన టోర్నీలు ఎలా ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొనే ఒలంపిక్స కు క్రీడాలోకంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వేలాది మంది క్రీడాకారులే కాదు.. పెద్ద ఎత్తున క్రీడల సమరంగా పేర్కొనే ఈ టోర్నీలో గెలవటం తర్వాత.. పాల్గొనే అర్హత సంపాదించటమే మెడల్ కొట్టినంత గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఈ మెగా టోర్నీని నిర్వహించటానికి ఆయా దేశాల వేలాది కోట్ల రూపాయిల్ని వెచ్చించాల్సి ఉంటుంది.

చివరకు.. ఒలింపిక్స్ కోసం చిన్న సైజు క్రీడా గ్రామాన్నే నిర్మించాల్సి పరిస్థితి. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు జపాన్ కిందా మీదా పడుతోంది. ఈ టోర్నీ నిర్వాహకులకు ఒక గొప్ప ఇబ్బంది తరచూ ఎదురవుతుంది. వారాల పాటు సాగే ఈ టోర్నీలో క్రీడాకారుల మధ్య సెక్సు రిలేషన్ బిల్డప్ కాకుండా ఉండటానికి.. ఆ మాటకు వస్తే.. సేఫ్ సెక్సు కోసం చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. భారీ ఎత్తున కండోమ్ ల్ని అందుబాటులో ఉంచుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఇబ్బంది పెడుతున్న కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల మధ్య సెక్స్ జరగకుండా ఉండటానికి జపాన్ సరికొత్త ఎత్తు వేసినట్లు చెబుతున్నారు.

క్రీడాకారులు ఒకరిని ఒకరు కలవకుండా ఉండేందుకు.. సెక్సు చేసేందుకు వెసులుబాటు కల్పించకుండా ఉండేలా ఒలింపిక్ నిర్వాహకులు పక్కా ప్లాన్ వేశారు. తక్కువ సామర్థ్యం ఉన్న మంచాల్ని సిద్ధం చేశారు. పడక సుఖం కోసం ఎవరైనా ప్రయత్నిస్తే.. వారి మంచాలు వాటిని మోసే సామర్థ్యం ఉండని రీతిలో వాటిని రెఢీ చేయటం ఆసక్తికరంగా మారింది. ఒలింపిక్ క్రీడా గ్రామంలో తక్కువ సామర్థ్యం ఉన్న మంచాల్ని.. అట్టలతో తయారు చేయటం గమనార్హం.

ఈ అట్టల్ని రీసైక్లింగ్ ద్వారా కాగితం ఉత్పత్తులుగా మారుస్తారని చెబుతున్నారు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత మంచాల్ని రీసైక్లింగ్ చేస్తారని చెబుతున్నారు. ఒక్కో బెడ్ కేవలం 200 కేజీలు మోసేలా వాటిని డిజైన్ చేశారు. దీంతో.. వేరే వారితో కలిసి పడక సుఖాన్ని పంచుకోవాలంటే.. మంచం కిర్రుమనటం తర్వాత.. ముందుగా కూలిపోతుందని చెబుతున్నారు. క్రీడాకారుల మధ్య అవసరమైన భౌతిక దూరానికి తగ్గించేందుకు ఈ విధమైన ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా చదివిన తర్వాత జపానోడి తెలివి మామూలు కాదనే చెప్పాలి. మరి.. విరహంతో రగిలిపోయే క్రీడాకారులు.. మరేం చేస్తారో చూడాలి.