Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ కొంప ముంచిన డమ్మీ అభ్యర్థి!

By:  Tupaki Desk   |   5 Dec 2020 5:25 AM GMT
టీఆర్ఎస్ కొంప ముంచిన డమ్మీ అభ్యర్థి!
X
గ్రేటర్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చింది. ఏ పార్టీకి ఓటరు పూర్తి స్థాయిలో సీట్లు ఇవ్వలేదు. టీఆర్ఎస్, బీజేపీ,ఎంఐఎంలకు దాదాపు సరిసమానంగా ఇచ్చేశాడు. టీఆర్ఎస్ కు 55 స్థానాలు కట్టబెట్టి అతిపెద్ద పార్టీగా నిలిపాడు. కానీ మేయర్ పీఠం మాత్రం కట్టబెట్టలేదు. ఇక బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాంగ్రెస్ కు 2 స్థానాలు ఇచ్చాడు. దీంతో హంగ్ అనివార్యమైంది.

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ లో చిత్ర విచిత్రాలు వెలుగుచూశాయి. బీఎన్ రెడ్డి నగర్ లో రీకౌంటింగ్ జరిగింది. తొలుత టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్నపై బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డి కేవలం 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు.

దీనిపై టీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేయగా.. మరోసారి లెక్కించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రీకౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించినట్టు ప్రకటించారు.

ఇక్కడ షాకింగ్ విజయం ఏంటంటే.. టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి 39 ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అసలు అభ్యర్థికి రావాల్సిన ఓట్లు డమ్మీ అభ్యర్థికి పడడంతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఓరకంగా టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థి వల్లే ఇక్కడ అసలు అభ్యర్థి ఓడిపోయిన పరిస్థితి తలెత్తింది.