పాతబస్తీలో డ్రగ్స్ దందా.. ముఠా అరెస్ట్

Sat Sep 19 2020 23:07:24 GMT+0530 (IST)

Drug dealing in old town Gang arrest

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం నుంచి సినీ ఇండస్ట్రీతో డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి. శాండిల్ వుడ్ ను కూడా ఈ డ్రగ్స్ మాఫియా కప్పేసింది.తాజాగా హైదరాబాద్ లోనూ డ్రగ్స్ మూలాలు బయట పడుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులు మహ్మద్ షా ఫాహాద్ షైక్ అబ్దుల్ ఒవైస్ లను ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు.

పాతబస్తీలోని వివిధ జిమ్ లలో ఈ నిషేధిత డ్రగ్ సరఫరా చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. వీరి నుంచి 30ఎంఎల్ స్టెరాయిడ్ ఇంజక్షన్లు 150 స్వాధీనం చేసుకున్నారు.

కాగా నిందితులను చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు. ఈ ముఠాలో మొత్తం ఎంతమంది ఉన్నారు. ఈ డ్రగ్ ఎవరెవరికి ఎక్కడెక్కడ అందజేస్తున్నారు. వీళ్లకి ఈ స్టెయిడ్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.