Begin typing your search above and press return to search.

వాంటెడ్ పర్సన్ను ద్రోన్లతో వేటుడుతున్నారా ?

By:  Tupaki Desk   |   31 March 2023 1:00 PM GMT
వాంటెడ్ పర్సన్ను ద్రోన్లతో వేటుడుతున్నారా ?
X
పంజాబ్ రాష్ట్రంలో ఒక వాంటెడ్ పర్సన్ను ప్రభుత్వం ద్రోన్ల సాయంతో వేటాడుతోంది. ఒక వ్యక్తిని పట్టుకోవటానికి ఊరు ఊరంతా ద్రోన్లతో వేటాడటం బహుశా దేశచరిత్రలో ఇదే మొదటిసారేమో. ఖలిస్ధాన్ ఉద్యమనేత అమృత్ పాల్ సింగ్ గురించే ఇదంతా. దాదాపు పదిరోజుల క్రితం పాల్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ఎంతగా ప్రయత్నించారో అందరికీ తెలిసిందే. సింగ్ ను పట్టుకునేందుకు పోలీసులు 200 కిలోమీటర్లు ఛేజ్ చేయటం దేశంలో సంచలనం సృష్టించింది. కొన్ని వందలమంది పోలీసు అధికారులు వందల కిలోమీటర్లు వెంటాడినా సింగ్ అయితే తప్పించుకున్నాడు.

అలాంటి సింగ్ ను ఎలాగైనా వెతికి పట్టుకోవాలని పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు సవాలుగా తీసుకున్నారు. అసలు రాష్ట్రంలోనే ఉన్నాడా ? లేకపోతే దేశం దాటిపోయాడా అన్నదే అర్ధంకావటంలేదు. పంజాబ్ సరిహద్దులగుండా పాకిస్ధాన్ వెళ్ళిపోయాడని, నేపాల్ మీదుగా పాకిస్ధాన్ చేరుకున్నారడని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అమృత్ పంజాబ్ లోని హోషియార్ పూర్లోనే ఉన్నాడని తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.

తాజా సమాచారం అధారంగా పోలీసులు మళ్ళీ రంగంలోకి దిగారు. హోషియార్ పూర్ మొత్తాన్ని పోలీసులు నిర్భందించేవారు. పట్టణంలోని అన్నీ దారులను మూసేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం నుండి పట్టణంలోని ఇల్లిల్లు గాలింపు మొదలుపెట్టారు. ఇది సరిపోదన్నట్లుగా పట్టణమంతా ద్రోన్లతో గాలిస్తున్నారు.

కమర్షియల్ కాంప్లెక్సులు, ఆఫీసు భవనాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ప్రైవేటు, ప్రభుత్వ భవనాలు దేన్నీ వదలటంలేదు. భవనాల్లో ఎక్కడ దాకున్నా కనుక్కోవాలన్న పట్టుదలతోనే కొన్ని వందల ద్రోన్లను రంగంలోకి దింపారు.

పట్టణ శివారు ప్రాంతాల్లో మిలిటరీ కూడా మోహరించింది. చాలాకాలంగా ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో ఈమధ్యనే మళ్ళీ ఖలిస్ధాన్ ఉద్యమం ఊపందుకుంటోంది. పంజాబ్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలన్నది ఖలిస్ధాన్ ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యం.

దీనికోసమే ఒకపుడు పంజాబ్ లో జరిగిన ఉద్యమాల్లో కొన్ని వేలమంది చనిపోయారు. ఉద్యమం పేరుతో ఖలిస్ధాన్ ఉద్యమకారులు తీవ్రవాదులుగా తయారయ్యారు. అలాంటి వారికి అమృత్ పాల్ సింగ్ నాయకుడు. రక్తపాతం ద్వారా మాత్రమే ప్రత్యేక దేశం వస్తుందని నమ్మేవాళ్ళంతా ఖలిస్ధాన్ కు మద్దతు పలుకుతున్నారు. మరి చివరకు ఇదెక్కడికి దారితీస్తుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.