బీరు తాగుతూ యోగా.. కిక్కిస్తుందంటున్న యువత

Sun Jan 24 2021 00:02:40 GMT+0530 (IST)

Drinking Beer while Doing Yoga

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రజల ఆరోగ్యంపైన తీవ్రంగా ప్రభావం చూపింది. నెలల తరబడి ఇంట్లోనే  ఉండడంతో ప్రజలు వ్యాయామం లేక  మానసికంగా కృంగిపోయి అనారోగ్యాల పాలయ్యారు.ఆసియా దేశం కాంబోడియాలో లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం యువత ఎంజాయ్ చేసిన వైనం కనిపించింది. ఇక్కడి యువత బీరు తాగుతూ యోగా చేస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.కాంబోడియా ముఖ్య నగరం నామ్ ఫెన్ లో యువతకు ఇప్పుడీ యోగా బీర్ బాగా ఉపశమనం కలిగిస్తోందట.. నలుగురితో కలిసి హాయిగా బీరు తాగుతూ యోగా చేయడాన్ని వారు బాగా అస్వాదిస్తున్నారట.. ఈ తరహా యోగాను ప్రముఖ బీరు తయారీ సంస్థ టూబర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ ప్రోత్సహిస్తోంది.బీరు తాగుతూ యోగా చేయడంతో ఎంతో సంతోషం కలుగుతోందని యువత ఉత్సాహంగా చెబుతోంది.కాంబోడియాలో కరోనాను కట్టడి చేశారు. ఇప్పటిదాకా ఆ దేశంలో కేవలం 456 కేసులు మాత్రమే నమోదు కాగా.. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఆరు వారాలు మాత్రమే అక్కడ లాక్ డౌన్ విధించారు.