Begin typing your search above and press return to search.

ఒక్క సెకనులో 57వేల సినిమాలను డౌన్‌లోడ్‌ ... జపాన్ అరుదైన రికార్డ్ !

By:  Tupaki Desk   |   21 July 2021 4:30 AM GMT
ఒక్క సెకనులో 57వేల సినిమాలను డౌన్‌లోడ్‌ ... జపాన్ అరుదైన రికార్డ్ !
X
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పరుగులుపెడుతున్న తరుణంలో ఇంటర్నెట్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. వేగవంతంగా పనులు జరగడానికి, వినియోగదారులు హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ను కోరుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో  అత్యంత వేగమైన డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు దేశాలన్నీ పోటీపడుతున్నాయి. తాజాగా  జపాన్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్‌ స్పీడ్‌ను దక్కించుకుంది.

ఇంటర్నెట్ స్పీడ్‌ లో జపాన్ సంచలన రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌ తో క్షణాల వ్యవధిలో డేటాను విజయవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. జపాన్ కు చెందిన రీసెర్చర్ల బృందం డిజిటల్ హైవేపై ఉస్సేన్ బోల్ట్  అంత వేగంతో ఇంటర్నెట్ స్పీడ్‌ రికార్డును నెలకొల్పింది. ఒక సెకనకు 319 టెరాబైట్ల ల స్పీడ్ ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ ఫర్ చేయడంలో విజయం అందుకుంది. ఈ ఒక బ్రాడ్ బ్యాండ్ స్పీడ్‌ తో 57వేల ఫుల్ లెన్త్ మూవీలను ఒక సెకనులో డౌన్ లోడ్ చేసేయచ్చన్నమాట.

స్ఫోటిఫై  లైబ్రరీ మొత్తాన్ని కేవలం 3 సెకన్లలోపే డౌన్ లోడ్ చేసేయొచ్చు. అంటే.. సెకనుకు 400 గిగాబైట్ల వేగంతో నడుస్తుంది. అదే మనదేశంలో ఎక్కువ మంది బ్రాడ్‌ బ్యాండ్ సర్వీసులను కేవలం 512kbps వద్ద మాత్రమే పొందుతారు. జపాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ  పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించింది. ఈ ఇంటర్నెట్ రికార్డు వేగాన్ని సాధించడానికి ప్రస్తుత ఆప్టికల్ ఫైబర్ మౌలిక సదుపాయాలను  ఉపయోగించారు. ఇందుకోసం 3,0001 కిలోమీటర్లకు పైగా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్సామిషన్ ను సెట్ చేసింది.

భారతీయ బ్రాడ్‌ బ్యాండ్ కమ్యూనిటీ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హై-స్పీడ్ ట్రాన్స్‌ మిషన్‌  ద్వారా ఇండియాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధికంగా డేటా స్పీడ్ అందించడానికి ప్రస్తుత భారతీయ ప్రసార వ్యవస్థల్లో సామర్థ్యం లేదని బ్రాడ్ బ్యాండ్ ఇండియా ఫోరం అధ్యక్షుడు టీవీ రామచంద్రన్ అన్నారు. ప్రస్తుతానికి మన దగ్గర 500 మిలియన్ లేదా అంతకంటే తక్కువ మంది వినియోగదారులు ఇంటర్నెట్‌ ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత ట్రాన్స్ మిషన్ సిస్టమ్‌ లను పరిశీలిస్తే.. ప్రస్తుత వ్యవస్థలు అధిక సామర్థ్యం గల డేటా సామర్థ్యం లేనందున సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు అని చెప్పారు. ఇదోక లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌ గా  ప్రెసిడెంట్ ప్రణావ్ రోచ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ఇండియాలో అమలు చేయాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు.