Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ పై అనుమానాలొద్దు: అమిత్ షా ప్రకటన

By:  Tupaki Desk   |   24 Jan 2021 8:20 AM GMT
వ్యాక్సిన్ పై అనుమానాలొద్దు: అమిత్ షా ప్రకటన
X
దేశవ్యాప్తంగా వైద్యులు - వైద్య సిబ్బంది - ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. అయితే కొందరు మాత్రం వ్యాక్సిన్ తీసుకోకుండా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ నాణ్యత - సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దని హోంమంత్రి అమిత్ షా స్పష్టతనిచ్చారు. ఈ వ్యాక్సిన్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్న వారికి ఇదే నా సవాల్ అన్నారు. ప్రజారోగ్యంపై రాజకీయం చేయడం మంచిది కాదని హితవు పలికారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ నాణ్యతపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న అనుమానాలను అమిత్ షా కొట్టిపారేశారు.

గౌహతిలో శనివారం ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’ పథకాన్ని లాంచ్ చేసిన అమిత్ షా మాట్లాడారు. మీ వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని అమిత్ షా సలహా ఇచ్చారు.

టీకా మందుపై కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందింపచేస్తున్నారని.. వారితో తాను చర్చకు రెడీ అని అమిత్ షా ప్రకటించారు. హెల్త్ వర్కర్లకు అనంతరం అందరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ఇందులో ఎలాంటి సందేహం వద్దన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని అమిత్ షా తెలిపారు.