అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వొద్దు.. రేప్ లు అవుతాయి

Thu Jun 10 2021 20:00:01 GMT+0530 (IST)

Dont give phones to girls UP Women Commission

అమ్మాయిల స్వేచ్ఛను హరించేలా యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మహిళా కమిషన్ సభ్యురాలు అయ్యిండి ఇలా తోటి మహిళలపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.యూపీ మహిళా కమిషన్ సభ్యురాలు మీనాకుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలకు ఫోన్లు ఇస్తే అవి అత్యాచారాలకు దారితీస్తాయని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అలీఘర్ లో మహిళల ప్రజాఫిర్యాదుల కార్యక్రమంలో మీనాకుమారి ఈ వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు గంటల తరబడి అబ్బాయిలతో ఫోన్ లో మాట్లాడుతారని.. ఆ తర్వాత వారితో పారిపోతారని.. పిల్లల ఫోన్లు పరిశీలించని తల్లిదండ్రులకు ఈ విషయాలేవీ తెలియవన్నారు.

ఇలా అమ్మాయిలపై నోరుజారిన మహిళా కమిషన్ సభ్యురాలిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈమె తీరు మార్చుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.