Begin typing your search above and press return to search.

కరోనాకు కంగారు పడ్డావో అంతే..!

By:  Tupaki Desk   |   2 April 2020 3:30 AM GMT
కరోనాకు కంగారు పడ్డావో అంతే..!
X
కరోనా వైరస్‌ కట్టడికి భారతదేశం ముందే స్పందించింది. ఆ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలను స్వీయ నిర్బంధం విధించింది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో కరోనా వైరస్‌ రోజురోజుకు పెరుగుతుండడం - మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యం.. లాక్‌ డౌన్‌ సందర్భంగా ఇంటికే పరిమితమైన ప్రజలు కొంత భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ ఎక్కడ సోకుతుందోననే భయంతో దినదిన గండంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో వారి మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంట్లో వారిక లేదా బయట వారికి ఏదైనా చిన్న అనారోగ్యం చెందినా కరోనా అంటూ కంగారు పడుతున్నారు. ఇక ఇంట్లో కరోనా భయంతో తుడిచినవే తుడవడం.. సబ్బుతో తరచూ చేతులు - ముఖం కడుక్కోవడం చేస్తున్నారు. ఒక్క నిద్రపోయినప్పుడు మినహా మిగతా సమయమంతా ఆ పనులు చేస్తూ బెంబేలెత్తుతున్నారు. ఇంతవరకు బాగానే ఇలాంటి పనులతో మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొందరి మానసిక స్థితికి క్రమం తప్పి వింతగా ప్రవర్తిస్తుండడం - ప్రతి ఒక్కరిని అనుమానించడం చేస్తుండడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్తున్నారు. ఇక కౌన్సెలింగ్‌ కు ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రికి తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి.

రుగ్మతలు ఇలా..

ఎవరు కొంత అనారోగ్యానికి గురైన కరోనా వైరస్‌ అంటూ కంగారుపడుతున్నారు. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ప్రజలు టీవీ - సోషల్‌ మీడియాతో బిజీగా ఉన్నాయి. అయితే వాటిల్లో కరోనా వైరస్‌ పై వస్తున్న పుకార్లు - వార్తలతో ప్రజలు ఇంట్లోనే ఆందోళన పడుతున్నారు. ఏది నిజమో.. అబద్ధమో తెలుసుకోకుండానే బెంబేలెత్తే పరిస్థితులు ఉన్నాయి. దీన్నే హైపర్‌ విజిలెన్స్‌ కేసులు అని అంటారంట. కరోనాపై అతిగా స్పందిస్తుండడంతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని మానసిక వైద్యులు చెబుతున్నారు. మరి అతిగా స్పందిస్తుండడంతోనే వారి మానసిక స్థితి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని తెలుస్తోందని పేర్కొంటున్నారు. మళ్లీమళ్లీ తుడవడం - తరచూ చేతులు కడుక్కోవడం అనేది కొంత ఒకే కానీ మరీ తీవ్రమైతే ఆందోళన చెందాల్సిందే. ఇలాంటి పరిస్థితి ఉంటే ఏం చేయాలో మానసిక నిపుణులు పలు సలహాలు - సూచనలు ఇస్తున్నారు.

– మొదట కరోనా వైరస్‌పై ఆందోళన చెందొద్దు. ప్రశాంతంగా ఉంటూనే లాక్‌డౌన్‌ ఉండడంతో ఇంటికే పరిమితమవ్వాలి.

– కుటుంసభ్యులతో సరదా కబుర్లు చెప్పుకోవడం - పుస్తకాలు చదవడం లేదా మీకు ఇష్టమైన పనులు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

– సోషల్‌ మీడియా - వార్త చానళ్లు తరచూ చూసి ఆందోళన చెందొద్దు. ముఖ్యమైన విషయాలు చూసి వదిలేయాలి.

– ఇంటికే పరిమితమవడంతో ఒంటరిగా ఫీల్‌ కాకూడదు. ఖాళీ సమయం లభించడంతో పాత మిత్రులు - బంధువులకు ఫోన్లు చేసి మాట్లాడుకోవచ్చు. వారితో సరదాగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటే మీ మధ్య బంధం బలోపేతమవుతుంది.

– పిల్లలతో సరదాగా గడపాలి. వారితో ఆటలాడుతూ ఉండండి. వారితో సరదాగా మాట్లాడుతూ గడపండి. పిల్లలతో సరదాగా గడిపితే మనసు హాయిగా ఉంటుంది. వారితో కలిసి మంచి మంచి సినిమాలు చూడండి. ఇలా చేస్తే పిల్లలు బోర్‌ ఫీలవకుండా ఉంటారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లలతో మీ బంధం ధృడమవుతుంది.

– వీటన్నిటిని పాటిస్తూనే పుకార్లు - వార్తలు వస్తే వాటిని విని వదిలేయండి. వాటిపై ఆందోళన చెందితే మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది.

– లాక్‌ డౌన్‌ అనే సమయం గొప్ప వరం. ఇన్నాళ్లు బిజీగా గడిపిన మీరు భార్యాపిల్లలు - కుటుంబసభ్యులతో ఇంట్లోనే హాయిగా గడిపే సదావకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుండి కుటుంబంతో సరదాగా ఉండండి.