Begin typing your search above and press return to search.

ఒక నల్లజాతి మహిళ , ఉపాధ్యక్షురాలిగా పనికిరాదు : ట్రంప్

By:  Tupaki Desk   |   14 Aug 2020 3:01 PM GMT
ఒక నల్లజాతి మహిళ , ఉపాధ్యక్షురాలిగా పనికిరాదు : ట్రంప్
X
అమెరికాలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ..మరోవైపు ఎన్నికల వేడి కాకరేపుతుంది. అమెరికాలో నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో కరోనా కష్ట కాలంలో కూడా కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ .. ట్రంప్ నిత్యం ఎదో ఒక వివాదాస్పదమైన కామెంట్ చేయనిదే ఆయనకి నిద్రపట్టదేమో. ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఒక రకంగా వర్మ కి ట్రంప్ కి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. నిత్యం ఇద్దరు వివాదాలతోనే సావాసం చేస్తుంటారు.

అమెరికాలో అతి త్వరలో జరగనున్న ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్‌ అభ్యర్థిగా ఎంపికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అర్హత పై సంచలన కామెంట్స్ చేసారు. అలాగే ఆమె పై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. వైట్‌ హౌస్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఆమె ఒక నల్లజాతి మహిళ. తల్లిదండ్రలు ఇక్కడకు వలస వచ్చారు. నేను విన్నది ఏంటంటే ఆమె ఇక్కడ జన్మించలేదు. అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికిరాదు. వైట్ ‌హౌస్‌ అవసరాలను తీర్చడానికి ఆమె అర్హురాలు కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే ట్రంప్‌ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి కమలా హ్యారిస్‌కు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు నెటిజనులు. ఆమె కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారని.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవ్వడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. ఆమె వివరాలను పరిశీలించిన న్యాయవాదులు కూడా దీని గురించి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు. జో బిడెన్‌ కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్‌ తన అక్కసును వెల్లగక్కడం గమనార్హం. ట్రంప్ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గురించి కూడా ట్రంప్‌ ఇలానే ప్రచారం చేశారు. ఆయన కెన్యాలో జన్మించారని.. అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి అర్హత లేదని ట్రంప్‌ ఆరోపించారు. దాంతో ఒబామా తాను హవాయిలో జన్మించినట్లు చూపిస్తూ తన జనన ధృవీకరణ పత్రాన్ని విడుదల చేశారు. అయినా కూడా దానిపై పెద్ద రచ్చ చేసారు.