Begin typing your search above and press return to search.

ఓడిపోతే దేశం వదిలిపోతా .. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   17 Oct 2020 5:30 PM GMT
ఓడిపోతే దేశం వదిలిపోతా ..  ట్రంప్ సంచలన వ్యాఖ్యలు !
X
అమెరికాలో ఎన్నికల వేడి , పోలింగ్ దగ్గర పడేకొద్దీ మరింతగా పెరిగిపోతుంది. వచ్చే నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు తనను మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే ఈ దేశాన్ని వదిలిపోతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జార్జియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ఆయన, రాజకీయ చరిత్రలో ఓ అధ్వాన్నపు అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోవడంకన్నా అదే బెటరేమో అని వ్యాఖ్యానించారు.

ఇది జోక్ కాదని, పొలిటికల్ హిస్టరీలో పస, సామర్థ్యం లేని అభ్యర్థిపై తను పోటీ చేయవలసి వస్తోందని, ఇది తనపై ఎంతో ఒత్తిడి తెస్తోందని ఆయన చెప్పారు. నేను ఓటమి పాలైతే మీరే ఊహించండి..నా జీవితమంతా ఏం చేయాలి , అయామ్ నాట్ గోయింగ్ టు ఫీల్ సో గుడ్.. ఐ మే లీవ్ దిస్ కంట్రీ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఈయన కన్నా డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కే పలు రాష్ట్రాల్లోని ఓటర్లు పట్టం కడుతున్నారు. ఫ్లోరిడాలో జరిగిన ర్యాలీలో బైడెన్ స్పీచ్ వినేందుకే చాలామంది హాజరయ్యారు. హాలంతా నిండిపోగా, ట్రంప్ గారి ర్యాలీకి మాత్రం జనం పలచగా కనిపించారు. నవంబరు 3 న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

ఇకపోతే , ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు వాచాలత్వం పెరుగుతోంది. తనేం మాట్లాడుతున్నారో తనకే తెలియడం లేదు. ఇప్పుడు భారత్ ‌పై నోరు పారేసుకున్నారు.. చైనా, రష్యాలతో కలిసి భారత్‌ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నదట. నార్త్‌ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌ ఈ మాటన్నారు. అధ్యక్షుడిగా తను ఎంతో చేశానని గొప్పలు చెప్పుకున్నారు.. అమెరికా ఇంధన స్వయం సమృద్ధిని సాధించిందంటే అది తన ఘనతేనని ఆత్మస్తుతి చేసుకున్నారు. అమెరికా పర్యావరణం, ఓజోన్‌ చక్కగా ఉన్నాయని, ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలే వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు