Begin typing your search above and press return to search.

ట్రంప్ కి భారత్ మెనూ నచ్చుతుందా?

By:  Tupaki Desk   |   24 Feb 2020 11:22 AM GMT
ట్రంప్ కి భారత్ మెనూ నచ్చుతుందా?
X
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇప్పటికే ఇండియాకి తన కుటుంబంతో సహా చేరుకున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ తో పాటుగా అయన భార్య మెలానియా ట్రంప్‌, కుమార్తె ఇవాంకా, అల్లుడు జరేద్‌ కుష్‌నర్‌తో కలసి ట్రంప్‌ సోమవారం అహ్మదాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ, ఆ తరువాత ఆయనతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఇక , రోడ్ షో ముగిసిన తరువాత నమస్తే ట్రంప్ సభని ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్దదైన మోతేరా స్టేడియంలో మోడీ - ట్రంప్ ప్రసంగించారు.

ఇక డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ పర్యటనకి రావడంతో ఆయనకి ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసారు. అయితే , అమెరికా , ఇండియా , ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఈ పర్యటనలో ట్రంప్ భారత్ గురించి ఏం మాట్లాడతారు అని, ఈ పర్యటనతో భారత్‌- అమెరికా సంబంధాలు ఎలా మెరుగుపడతాయి అని ఆలోచిస్తున్నారు. కానీ , ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది మాత్రం ..అయన ఫుడ్ మెనూ పై ఆలోచిస్తున్నారు.

సాధారణంగా డోనాల్డ్ ట్రంప్‌ తన డైట్‌ లో ఎక్కువగా నాన్‌ వెజ్‌ బర్గర్‌ లు, స్టీక్‌, మటన్‌ తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో భారత్‌లో ట్రంప్‌ పర్యటించే 36 గంటల్లో ఆయన మెనూ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌ కోసం, భారదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయిస్తున్నారు. అయితే , మోడీ తయారు చేయించే వంటకాలలో ఎక్కువ శాతం వెజ్‌ ఐటమ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వెజ్‌ బర్గర్‌లు, మల్టీగ్రెయిన్‌ రోటీ, సమోసా మొదలైనవి ట్రంప్‌ కోసం ప్రత్యేకంగా చేయిస్తున్నారు.

ఈ విషయంపై సంబంధించిన ట్రంప్‌ సిబ్బంది... అధ్యక్షుడి డైట్‌ లో ఎప్పుడు వెజిటేరియన్‌ ను చూడలేదని, ఇండియా మెనూ విషయంలో ఆయన ఏం చేస్తారో చూడాలి అని తెలిపారు. ట్రంప్‌ ఎప్పుడూ తినే మెక్‌ డొనాల్డ్‌ లో కూడా బీఫ్‌ బర్గర్‌ లు అందుబాటులో లేవని, ట్రంప్‌ ఇప్పటి వరకు ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా ఆయన కోసం స్టీక్‌ అందుబాటులో ఉంచుతారని, అది వీలుకాకపోతే మటన్‌ ను మెనూలో జత చేరుస్తారని తెలిపారు. ఇక ట్రంప్ కి బీఫ్ అంటే చాలా ఇష్టం. కానీ , బీఫ్ ని ఇండియా లో పూజిస్తారు. దీనితో ఇండియా లో బీఫ్ దొరకడం కష్టం. ఈ నేపథ్యంలో భారత్ మెనూ పై ప్రెసిడెంట్ ట్రంప్‌ ఏ విధంగా స్పందిస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇకపోతే - ట్రంప్ - ప్రధాని మోడీ తో కలిసి మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌ లో ఏర్పాటు చేసిన విందుకి హాజరుకానున్నారు.