Begin typing your search above and press return to search.

చాలా లేట్ గా లేచిన ట్రంప్!

By:  Tupaki Desk   |   29 March 2020 4:50 AM GMT
చాలా లేట్ గా లేచిన ట్రంప్!
X
చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా మారింది అమెరికా పరిస్థితి. కరోనా కేసులు లక్ష దాటడం.. ఒకే రోజు 1700పైగా మరణించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేట్ గా నిద్రలేచారు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు తాజాగా కరోనా వైరస్ పై పోరాడేందుకు అమెరికా సిద్ధమైందని ట్రంప్ ప్రకటించారు.

కరోనా ఏమైనా జంతువా పట్టుకొని లోపలేయడానికి.. అంటు వ్యాధి. ఇప్పటికే ప్రజలు సామూహికంగా తిరగడం వల్ల అమెరికా అంతటా పాకిపోయింది. దీంతో ట్రంప్ ఇప్పుడు చేయిదాటాక కంట్రోల్ చేస్తానని ప్రకటన ఇవ్వడంపై అమెరికన్లు మండిపడుతున్నారు.

తాజాగా ట్రంప్ స్పందిస్తూ అమెరికా వ్యాప్తంగా 11.6 మిలియన్ల ఎన్95 రెస్పిరేటర్లు - 26 మిలియన్ల సర్జికల్ మాస్కులు - 5.2 మిలియన్ల ఫేస్ షీల్డ్స్ - 4.3 మిలియన్ల సర్జికల్ గ్లౌజులు - 22 మిలియన్ల గ్లౌజులు - 8వేల వెంటిలేటర్లను సిద్ధం చేశామని తెలిపారు.

కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి అన్ని రకాల సాయానికి ప్రభుత్వం సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.కరోనాపై గెలుస్తామన్నారు. లక్ష కరోనా కేసులు దాటి.. వందల మరణాలు చోటుచేసుకుంటూ ఇటలీని దాటేశాక కానీ మన ట్రంప్ సార్ నిద్ర లేవకపోవడం విశేషం. లేట్ అయిన లేచిన ట్రంప్ ఇకనైనా అమెరికన్ల దుస్థితి మారుస్తాడేమో చూడాలి.