Begin typing your search above and press return to search.

భారత్ కు షాక్..ట్రంప్ ఇలా చేస్తాడనుకోలేదు!

By:  Tupaki Desk   |   23 Feb 2020 9:59 AM GMT
భారత్ కు షాక్..ట్రంప్ ఇలా చేస్తాడనుకోలేదు!
X
అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ వస్తున్నాడు.. భారత్ కు వరాల మూట తెస్తాడు అని ఆశించిన భారతీయులకు - భారత ప్రభుత్వానికి భంగపాటు ఎదురైంది. అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా భారత్ తో భారీ వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ పర్యటనలో అలాంటి ఉద్దేశమే లేదన్నట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. చివరి నిమిషంలో భారత్ తో సంబంధాలపై అమెరికా చేతులెత్తేసినట్టు తెలిసింది.

భారత్ తో భారీ ప్రతిష్టాత్మక ఒప్పందాలు చేసుకోవాలని.. వివిధ రంగాల్లో అమెరికా-భారత్ ముందుకెళ్లాలని అధికారులు కసరత్తు చేశారు. అయితే తాజాగా యూఎస్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు బాంబు పేల్చారు. భారత్ తో వాణిజ్య సంబంధాలు అమెరికాకు కీలకమే.. అయితే భారత్ కూడా అమెరికాతో వాణిజ్య విధానాలు సడలిస్తే ఒప్పందాలు కుదురుతాయని తెలిపారు.

ప్రధానంగా టారీఫ్ లను తగ్గించడంతోపాటు మార్కెట్ విస్తృతి పెంచుకునే అవకాశాలపై ఇరుదేశాలు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలోనే భారత్ లోకి వస్తున్న అమెరికా డివైస్ లపై టారీఫ్ పరిమితులను సడలించాలని అమెరికా కోరుతోంది. ఇదే సమయంలో జీఎస్పీ నుంచి భారత్ ను అమెరికా తొలగించడం మన దేశం అభ్యంతరం తెలుపుతోంది. వెంటనే తీసుకోవాలని కోరుతోంది.

మోడీ - ట్రంప్ లు సోమవారం ఉదయం 11 గంటలకు స్వదేశీ భద్రత ఇంధన - రక్షణ రంగాలపై ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే ట్రంప్ లాంటి గండరగండరుడు ఈ ఒప్పందాలను భారత్ తో చేసుకుంటాడా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.ఇప్పటికే భారత్ తమ వ్యాపారాన్ని అడ్డుకుంటోందని ట్రంప్ అంటున్న నేపథ్యంలో ఒప్పందాలు జరగడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.