Begin typing your search above and press return to search.

రాబోయే 30 రోజులు గడ్డుకాలమే..అసలు విషయం చెప్పిన ట్రంప్?

By:  Tupaki Desk   |   1 April 2020 1:00 PM GMT
రాబోయే 30 రోజులు గడ్డుకాలమే..అసలు విషయం చెప్పిన ట్రంప్?
X
కరోనా మహమ్మారి ..ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలని హడలిపోయేలా చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ మహమ్మారి దెబ్బకు వణికిపోతోంది. రోజురోజుకీ అమెరికాలో కరోనా త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకుంటూ వెళ్తోంది. దీంతో గ‌త ఐదు రోజులుగా వేల సంఖ్య‌లో కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,88,647 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 4,059 మంది మృతి చెందారు. న్యూయార్క్ న‌గ‌రం ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. ఇక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా 76 వేలకి పైగా కరోనా కేసులు న‌మోద‌య్యాయి.

న్యూయార్క్ త‌ర్వాత న్యూజెర్సీ - కాలిఫోర్నియా - ఫ్లోరిడా - వాషింగ్ట‌న్‌ - లూసియానా - పెన్సీల్వేనియా - జార్జీయా - టెక్సాస్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో దేశంలో నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితులపై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు... రాబోయే రెండు వారాలు ఎంతో క‌ఠిన‌మైవ‌న‌వి, అమెరిక‌న్లు ధైర్యంగా ఉండాల‌ని తెలిపారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..దేశంలో ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి క‌రోనా విస్త‌రిస్తున్న తీవ్ర‌త‌ను బ‌ట్టి సుమారు 2.40 ల‌క్ష‌ల మ‌ది ప్రాణాలు కోల్పోవ‌చ్చ‌ని, ఇది తాను చెబుతున్నది కాద‌ని.. వైద్య నిపుణుల అంచ‌నా ప్ర‌కారం తెలిసిన చేదు నిజ‌మ‌ని తెలిపారు.

ఈ క్రమంలో ఆయ‌న‌ క‌రోనాను ప్లేగు వ్యాధితో పోల్చారు. రాబోయే క‌ఠిన రోజుల‌ను ఎదుర్కొనేందుకు అమెరిక‌న్లు రెడీగా ఉండాలాని సూచించారు. పౌరులు త‌ప్ప‌నిస‌రిగా వ్య‌క్తిగ‌త శుభ్ర‌త‌ - సామాజిక దురాన్ని పాటించాల‌న్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌మ‌ను తాము కాపాడుకోవ‌డంతో పాటు చుట్టుప‌క్క‌ల వారిని కూడా క‌రోనా బారిన‌ప‌డ‌కుండా కాపాడిన వారు అవుతార‌ని , ఈ సమయంలో ఇది చాలా కీలకంగా అని తెలిపారు.

అమెరికాలో కరోనా బారిన పడి.. దాదాపు 2లక్షల 40వేల మందికి పైగా చనిపోతారని అమెరికా దౌత్యవేత్త, వైద్యురాలు అయిన డెబోరహ్ లీహ్ బిర్క్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే ట్రంప్.. రానున్నది గడ్డు కాలం.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడం గమనార్హం.