Begin typing your search above and press return to search.

యోగా చేస్తే ఆరోగ్యంతో పాటు అందం.. మీరు చేయండి: స‌రికొత్త యోగా విధానం

By:  Tupaki Desk   |   4 July 2020 6:10 PM GMT
యోగా చేస్తే ఆరోగ్యంతో పాటు అందం.. మీరు చేయండి: స‌రికొత్త యోగా విధానం
X
మ‌న దేశ గొప్ప సాధ‌న యోగా. భార‌త‌దేశంలో పుట్టిన ఈ యోగాకు అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. మొన్న‌నే ఉన్నంత‌లో ఘ‌నంగా యోగా దినోత్స‌వం చేసుకున్నాం. మానసిక ప్ర‌శాంతత‌.. నిండు ఆరోగ్యం కోసం.. మాన‌సికోల్లాసం వంటి వాటి కోసం యోగా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. తాజాగా యోగా‌తో అందం కూడా రెట్టింపు అవుతుంద‌ని తెలిసింది. యోగా మ‌న శ‌రీరానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ‌యోగాలో అనేక రకాలు ఉన్నాయి. అయితే ఏ ర‌కం చేస్తే మ‌న అందం పెరుగుతుంద‌ని ఓ స‌ర్వే తెలిపింది. యోగా ముఖంపై కూడా దాని ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిసింది. ఈ క్ర‌మంలో ముఖానికి స్ట్రెచింగ్ ఇవ్వడం ద్వారా ముఖంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొత్త‌గా ఫేషియ‌ల్ యోగా అనేది వ‌చ్చింది. ఈ యోగాతో ముఖంపై క్రమంగా చారలు, ముడతలు తగ్గేందుకు దోహదం చేస్తుంద‌ని.. వృద్ధాప్య ఛాయలు దూరమ‌వుతాయని ప‌లువురు యోగా నిపుణులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం యోగాకు ప్ర‌పంచ దేశాల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ సంద‌ర్భంగా ఆ దేశాల్లో యోగా స్టూడియోలు, క్లాసులకు ఆదరణ పెరుగుతోంది. ఇక మ‌న గ‌డ్డ‌పై ఆవిర్భ‌వించిన ఈ యోగాకు విశేష ప్రాచుర్యం ఉంది. రో్జురోజుకు యోగాలో కొత్త కొత్త మార్పులు సంభ‌విస్తున్నాయి. అందులో భాగంగా ఫేషియ‌ల్ యోగా ఒక‌టి వ‌చ్చింది. మ‌హారాష్ట్ర‌లోని ముంబైకి చెందిన యోగా మాస్టర్ జెనిల్ ధోలాకియా ఈ స‌రికొత్త ఫేషియ‌ల్ యోగా గురించి వివ‌రించారు.

ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం ముఖంపై స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని తెలిపారు. ఆ తర్వాత కొన్నాళ్ల‌కు ముఖంపై చారలు, ముడతలు, డార్క్ సర్కిల్స్, అకాల వృద్ధాప్యం వంటి సమస్యలకు దారి తీస్తుందని వివ‌రించారు. దీనికి ప్రతిగా రోజూ ఫేస్ యోగా చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి, చర్మ కణాలకు ఆక్సిజన్ అందుతుందని పేర్కొన్నారు. దీనిద్వారా ప్రకాశవంతమైన.. ఆరోగ్యకరమైన ఫేస్ గ్లో సొంతం చేసుకోవచ్చని ఆమె చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఫేస్ యోగా ఎలా చేయాలో వివ‌రించారు.

సాధారణ ఫేస్ యోగా సాధ‌న ఇలా..
- తల పైకెత్తి చూస్తూ అరచేతులను ఉపయోగించి మెడపై మసాజ్ చేసుకోవాలి. ఇది టోన్డ్ నెక్‌లైన్ ఇస్తుంది.
- చెంప‌లపై సహజమైన బ్లష్ పొందడం కోసం నోటిని గరిష్టంగా గాలితో నింపి కుడివైపు, ఎడమవైపుకి బుగ్గలను తిప్పాలి. చిన్న‌ప్పుడు మ‌నం త‌ర‌చుగా చేసే ఉంటాం. అది గుర్తు తెచ్చుకోండి.
- చెంప ఎముకల చుట్టూ వేలి చివర్లతో మసాజ్ చేసుకోవాలి
- నుదుటిపై వేళ్లను ఉంచి, సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ, నుదుటిపై ఎడమ నుంచి కుడికి స్లైడ్ చేయండి. ఇది చారలను వదిలించడానికి దోహ‌దం చేస్తుంది.
- వీలైనంతగా నాలుకను బయట ఉంచి, కాసేపు అలాగే ఉంచి మళ్లీ మామూలు స్థితికి రండి.

ఈ విధంగా స‌రికొత్త ఫేస్ యోగా గురించి యోగా మాస్టర్ జెనిల్ ధోలాకియా చెప్పారు. మీరు ప్ర‌యత్నించండి.. ఆరోగ్యంతో పాటు అందం పెంచుకోండి. దీంతో పాటు సాధార‌ణ యోగా చేసినా శ‌రీరం చురుగ్గా ప‌ని చేస్తుంది. రోజంతా ఉల్లాసంగా ప‌ని చేయ‌డానికి దోహ‌దం చేస్తుంది.