Begin typing your search above and press return to search.

కరోనా రోగులను కుక్కలూ పసిగడతాయి..! ట్రైనింగ్​ మామూలుగా లేదుగా..!

By:  Tupaki Desk   |   25 Nov 2020 11:30 PM GMT
కరోనా రోగులను కుక్కలూ పసిగడతాయి..!  ట్రైనింగ్​ మామూలుగా లేదుగా..!
X
కరోనాను గుర్తించాలంటే పరీక్షలే అవసరం లేదు. కుక్కలు కూడా కరోనా రోగులను గుర్తిస్తున్నాయి. యూఏఈలో కరోనా రోగులను గుర్తించేలా కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. యూఏఈ, లెబనాన్, ఫిన్లాండ్ విమానాశ్రయాల్లో స్నిఫ్ఫర్ డాగ్స్ కు శిక్షణ ఇస్తున్నారు. లెబనాన్ దేశంలో 1680 మంది ప్రయాణికులు శునకాలు స్క్రీన్ చేయగా, వారిలో 158 కరోనా కేసులను గుర్తించాయి. శునకాలు గుర్తించిన వారిని పీసీఆర్ టెస్ట్ చేయగా వారికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు సాగాయి. కుక్కలు కరోనాను నియంత్రంచడంలో సాయపడుతున్నాయని వాళ్లు చెబుతున్నారు. కరోనా వైరస్​ వాసనను కుక్కలు పసిగడుతున్నాయని.. శాస్త్రవేత్తలు చెబుతన్నారు. కరోనాను అరికట్టేందుకు ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపై ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు.

అయితే కుక్కలు కూడా కరోనా రోగులను గుర్తించడం మంచి పరిణామేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని పరిశోధనలు సాగాలని వారు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే వర్క్​షాపులు కూడా నిర్వహించారు. ఇంటర్నేషనల్ కే9 బృందం పేరుతో ఆన్ లైన్ వర్క్ షాప్ నిర్వహించారు.

నవంబర్ 3వ తేదీన ఇంటర్నేషనల్ కే9 బృందం పేరుతో నిర్వహించిన ఆన్ లైన్ వర్క్ షాప్ లో శునకాల ద్వారా కరోనా వైరస్ ను గుర్తించవచ్చని హోల్గర్ వోల్క్ అనే వెటర్నరీ న్యూరాలజిస్ట్ పేర్కొన్నారు.

ప్రస్తుతం లెబనాన్, ఫిన్లాండ్ దేశాల్లో ఈ రకమైన పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే కేవలం కుక్కల ద్వారా పరీక్షలు నిర్ధారించగలిగితే ఖర్చు చాలా తక్కువ ఉందని భావిస్తున్నారు. అయితే ఈ రకమైన విధానం ఆచరణ సాధ్యమేనా.. పెద్ద మొత్తంలో కుక్కల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చా లేదా? అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.