Begin typing your search above and press return to search.

షర్మిలను తెలంగాణ సమాజం నమ్మడం లేదా?

By:  Tupaki Desk   |   5 March 2021 9:11 AM GMT
షర్మిలను తెలంగాణ సమాజం నమ్మడం లేదా?
X
తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆంధ్రా ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అందుకే తెలంగాణ బిడ్డ కాకున్నా.. తెలంగాణ కోడలు అని చెప్పుకుంటూ కవర్ చేసుకుంటోంది.ఇన్నాళ్లు తెలంగాణ సమస్యలపై అస్సలు నోరెత్తని షర్మిల ఎటు పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  2014 ఎన్నికల తర్వాత షర్మిల ఎక్కడికి వెళ్లింది.? ఎవరి కోసం పనిచేసిందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదట... కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మీద.. ఉద్యోగాల మీద ఫైట్ చేస్తుంటే ఇన్ని రోజులు ఇంతవరకు ఎందుకు మాట్లాడడం లేదని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

2014 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు గెలిచిన తర్వాత నీళ్లు నిధుల మీద టీడీపీ వర్సెస్  టీఆర్ఎస్ రెండు రాష్ట్రాల తరుఫున ఫైట్ చేసుకుంటే... ఎందుకు ఈ తెలంగాణ కోడలుకు ఈ విషయాలపై స్పందించలేదని తెలంగాణ వాదులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ రేపు మళ్లీ అన్నతో సఖ్యత ఏర్పడితే మళ్లీ ఆంధ్రా వెళితే మా పరిస్థితి ఏందని జిల్లాల నాయకులు కూడా ఆత్మరక్షణలో పడుతున్నారు. అందుకే షర్మిలకు దూరంగా ఉంటున్నారట..

లోటస్ పాండ్ కు  కనీసం సర్పంచ్ లెవల్ మనుషులు కూడా రావడం లేదని.. ఆంధ్రా సెటిలర్స్ కొందరు వ్యాన్ లో ఎక్కించుకొని ప్రజలను తీసుకొస్తే షర్మిల టీం ఫొటోలు, వీడియాలతో నడిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అసలు ఇంతవరకు ఒక స్పష్టత షర్మిలకు రాలేదని.. ఆంధ్రాతో ఫైట్ చేసే దమ్ము షర్మిలకు లేదు కదా అని కూడా అంటున్నారు.

తెలంగాణలో రాజకీయం చేయడం అంత ఈజీకాదని.. తెలంగాణలో ఉద్యమకారుల గడ్డ కాబట్టి.. తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వనంతవరకు వాళ్లు షర్మిలను నమ్మరు అని కూడా అంటున్నారు.  ఇంతవరకు అయితే షర్మిల దగ్గరికి ఆంధ్రా సెటిలర్లు మాత్రమే వస్తున్నారని.. కానీ నిజమైనా తెలంగాణ వాదులు రావడం లేదు అని ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయని అంటున్నారు.

షర్మిలతో పెద్దగా ఇబ్బంది ఉండదని టీఆర్ఎస్  శ్రేణులు భావిస్తున్నారని.. అందుకే ఆమెను గులాబీ దండు లైట్ తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సర్వే  ఒరిజినల్ రిపోర్ట్ ఏమీ ఏందో చూడాలని..   రాబోయే రోజుల్లోనే ఇది తేలుతుందని నెటిజన్లు అంటున్నారు.