Begin typing your search above and press return to search.

మ‌ధు యాస్కీకి టికెట్ ఉందా?

By:  Tupaki Desk   |   28 May 2022 1:30 PM GMT
మ‌ధు యాస్కీకి టికెట్ ఉందా?
X
తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స్ కానుంది. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఐదేళ్ల‌కు ఎలానూ 2023లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఇదిలావుంటే.. సీఎం కేసీఆర్ మ‌రో ఆరు మాసాల ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే టాక్ కూడా వ‌స్తోంది. దీనిపై ఇప్ప‌టికే అనేక చ‌ర్చ‌లు.. విశ్లేష‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. మొత్తానికి తెలంగాణ‌లో ఎన్నిక‌ల‌పై మిక్స్‌డ్ టాక్ న‌డుస్తోంది. అయితే.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లైతే.. ఖాయం. దీంతో అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. గెలుపుగుర్రం ఎక్కి.. అధికారం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

ఈ క్ర‌మంలో ఎవ‌రి లెక్క‌లు వారికి ఉన్నాయి. మొద‌టి ప్లేస్‌లో కాంగ్రెస్‌, రెండో ప్లేస్‌లో టీఆర్ ఎస్‌, మూడో ప్లేస్లో బీజేపీ ఉంద‌ని.. కాంగ్రెస్‌కి 45-50 సీట్లు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇక‌, అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు కూడా 40-45 సాట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఎంఐఎంకి వాళ్లు 7 వ‌స్తాయి కాబ‌ట్టి.. బీజేపీకి 8 నుంచి 14 సీట్లు వ‌చ్చే చాన్స్ ఉంద‌ని..ఒక అంచ‌నా వేస్తున్నారు విశ్లేష‌కులు. కానీ, ఏ పార్టీకైనా మెజారిటీ రావాలంటే.. 60 సీట్లు కావాలి. మొత్త సీట్లు 117. సో.. 60 సీట్లు ద‌క్కించుకున్న పార్టీనే అధికారంలోకి వ‌స్తుంది.

అయితే.. ప్ర‌స్తుతం ఎవ‌రికీ ఫుల్ మెజారిటీ వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని, అందుకే ఉత్త‌ర తెలంగాణ‌లో కాంగ్రెస్ పుంజుకోవాల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. అంటే. రేవంత్‌రెడ్డిని అక్క‌డ ఎక్కువ‌గా తిప్పాల‌ని అంటున్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్‌లో ఉన్న కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు హైక‌మాండ్ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి ఉంది కానీ, వారికి ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి లేదు. ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, ప్ర‌జ‌ల్లో ఏమాత్రం ప‌లుకుబ‌డి లేని వారిలో మ‌ధు యాస్కీ ఒక‌రు.. అంటున్నారు.. ప‌రిశీల‌కులు. ఇక‌, ఇదే వ‌రుస‌లో వీ హ‌నుమంత‌రావుకూడా ఉన్నారు. ప్ర‌తిదానికీ.. వేలు పెట్టి మేము సీనియ‌ర్ నాయ‌కులం అని.. బిల్డ‌ప్ ఇస్తారు.

కానీ, ఇద్ద‌రికిప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి లేదు. కానీ, హైక‌మాండ్ ద‌గ్గ‌ర ఫిర్యాదులు చేసే ప‌లుకుబ‌డి ఉంది అని అందుకే వాళ్లు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. వీహెచ్ అయితే.. వైఎస్ కాలంలో కూడా.. అస‌మ్మ‌తి నాయ‌కుడిగా ఉన్నారు. కానీ, 1989లో ఒక్క‌సారి ఎమ్మెల్యే చేసి.. మంత్రి అయ్యారు త‌ప్పితే.. త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి నాలుగు ఓట్లు సాధించే ప‌రిస్థితి లేదు. అయితే.. ప‌రిస్థితి ఇలా ఉన్నా.. ఆయ‌న మాత్రం నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి.. పీసీసీ చీఫ్‌ను విమ‌ర్శించ‌డం.. గ‌తంలో ప‌నిచేసిన మాజీ పీసీసీని కూడా విమ‌ర్శించ‌డం.. చేస్తున్నారు.

ఇలానే.. 2004, 2009 ఎన్నిక‌ల్లోల నిజామాబాద్ నుంచి విజ‌యం సాధించిన మ‌ధు యాస్కీ గౌడ్ ఆ త‌ర్వాత‌.. జ‌రిగిన 2014, 2019 ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌లేదు స‌రిక‌దా.. థ‌ర్డ్ ప్లేస్‌కు ప‌డిపోయారు. ఆయ‌న కార‌ణంగా.. ఎమ్మెల్యే సీట్లు కూడా పోయాయ‌ని.. కాంగ్రెస్ నాయ‌కులే చెప్పుకొంటారు. ఆ త‌ర్వాత‌..అక్క‌డ బీజేపీ పుంజుకుంది. పసీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు కూడా అయిన‌.. డీఎస్ కుమారుడు బీజేప‌లో చేరిన అర్వింద్ ఎంపీగా గెలిచాడు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. కాంగ్రెస్ ను బ‌లోపేతం చేద్దాం.. కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రిద్దాం.. అనే ఆలోచ‌న కూడా యాస్కీ చేయ‌లేదు.

ప్ర‌జ‌ల్లోఆయ‌న తిరిగ‌లేదు.. ప్ర‌జ‌ల్లో ఉండ‌లేద‌ని.. అక్క‌డి కాంగ్రెస్ నేత‌లు బ‌హిరంగ విమ‌ర్శ‌లే చేస్తున్నారు. ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని.. న‌ల్గొండ జిల్లాలో ఎక్క‌డి నుంచి అయినా.. పోటీ చేయాల‌ని.. యాస్కీ చూస్తున్నార‌ట‌. ఒక‌వేళ అదృష్టంతో కాంగ్రెస్ గెలిస్తే.. క‌నీసం.. మినిస్ట‌ర్ ప‌ద‌విని కొట్టొచ్చు అని.. ఆయ‌న ఆల‌చోనగా ఉంద‌ని చెబుతున్నారు. కానీ, ఆయ‌న‌కు క‌నీసం.. పోటీ చేసేందుకు సీటు అయినా.. ద‌క్కుతుందా? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఆయ‌న‌కు సీటు రాద‌ని.. ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు. ఒక‌వేళ హైక‌మాండ్ ఇచ్చినా.. కాంగ్రెస్ సీనియ‌ర్స్ అత‌నిని ఓడ‌గొట్టేందుకు రెడీగా ఉన్నార‌ని.. మ‌రో టాక్ న‌డుస్తోంది.

మొత్తానికి యూత్ కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డిని , కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డిని.. ఇష్ట‌ప‌డుతున్నారని, అందుకే వాళ్లు ప్ర‌జ‌ల్లో ఉంటున్నార‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు సాగుతున్నాయి. వీహెచ్‌, మ‌ధు యాస్కీ లాంటి.. ప్ర‌జ‌ల్లో లేని నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోని నాయ‌కులు.. ప్ర‌జ‌ల మ‌ధ్య తిర‌గ‌ని నాయ‌కులు.. కాబ‌ట్టి.. వారికి సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.