Begin typing your search above and press return to search.

కూర్చొని పనిచేస్తున్నారా? జర జాగ్రత్త..!

By:  Tupaki Desk   |   23 Feb 2021 3:30 AM GMT
కూర్చొని పనిచేస్తున్నారా? జర జాగ్రత్త..!
X
మారుతున్న జీవనవిధానంతో ఉద్యోగాలు కూడా మారిపోయాయి. ప్రస్తుతం డిజిటల్​ యుగం నడుస్తోంది. ఆ రంగం మీద ఆధారపడి ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. దీంతో గంటలు గంటలు కంప్యూటర్​ ముందు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. అయితే నిరంతరం ఒకేచోట కూర్చొని పనిచేయడం వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. వెన్నునొప్పి.. బీపీ, షుగర్​ లాంటి సమస్యలు వస్తాయని గతంలో తెలిసిందే. అయితే తాజాగా గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని పరిశోధకులు అంటున్నారు.

రెండు గంటలపాటు ఒకేచోట కూర్చొని పనిచేయడం చాలా డేంజర్​ అని శాస్త్రవేత్తలు అటున్నారు.
రోచెస్టర్, మిన్నెసోటాకు చెందిన మయో వైద్యులు ఇటీవల ఈ అంశంపై పరిశోధన సాగించారు. ఒకే చోట కూర్చొని పరిశోధన చేసేవాళ్ల మీద వాళ్ల పరిశోధనలు సాగాయి.
కూర్చొని పనిచేసేవాళ్లకు హృద్రోగాలు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధన తేల్చింది. దాదాపు
2వేల మందికి పై పరిశోధన సాగించారు.
అయితే ఒకేచోట కూర్చొని పనిచేసేవాళ్లు కచ్చితంగా రెండు గంటలకు ఓ సారి .. లేచి వాకింగ్​ చేయాలని వాళ్లు సూచిస్తున్నారు.


ఎంత పని ఒత్తిడి ఉన్నా, కచ్చితంగా కుర్చీలోంచి లేవడం మర్చిపోకూడదని సూచిస్తున్నారు. ప్రతిరోజు వాకింగ్​, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్లే కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే..
బీపీ వస్తుంది, కొవ్వు పేరుకుపోతుంది, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూర్చొని పనిచేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.