Begin typing your search above and press return to search.

'సీటీమార్' అన్న డాక్టర్లు.. వన్స్ మోర్ అన్న హీరోయిన్!

By:  Tupaki Desk   |   18 May 2021 12:46 PM GMT
సీటీమార్ అన్న డాక్టర్లు.. వన్స్ మోర్ అన్న హీరోయిన్!
X
దేశంలో ఎటు చూసినా క‌రోనా క‌ల్లోల‌మే క‌నిపిస్తోంది. రోగుల ఆవేద‌న‌లు.. బంధువుల ఆక్రంద‌న‌లే న‌లువైపులా వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితిని కాస్త కూల్ చేసేందుకు, బాధితుల్లో ధైర్యం నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు వైద్యులు. అటు దేహానికి వైద్యం అందిస్తూనే.. ఇటు మ‌న‌సుకు సైతం ఉల్లాసాన్ని అందిస్తున్నారు.

ఈ మ‌ధ్య ఒక‌టీ రెండు చోట్ల వైద్యులు డ్యాన్సులు చేసి.. రోగుల‌ను ఉత్సాహ‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. మ‌రికొంద‌రు వైద్యులు 'సీటీ మార్‌' అంటూ దుమ్ములేపారు. స‌ల్మాన్ - దిశాప‌ఠాని న‌టించిన ‘రాధె’ మూవీ ఇటీవ‌ల విడుద‌లైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సీటీమార్ సాంగ్ అంద‌రినీ హుషారెత్తిస్తోంది.

ఇప్పుడు ఇదే పాట‌కు డ్యాన్స్ వేశారు డాక్ట‌ర్స్‌. ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ మాదిరిగా వారు వేసిన స్టెప్పులకు హీరోయిన్‌ దిశాప‌ఠాని ఫిదా అయిపోయింది. ఈ వీడియోను త‌న ఫ్యాన్స్ తోపాటు నెటిజ‌న్ల‌కు కూడా చూపించేందుకు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.

ఇది చూసిన నెటిజ‌న్లు డాక్ట‌ర్ల‌ను ప్ర‌శంసల్లో ముంచెత్తుతున్నారు. సూప‌ర్బ్ డ్యాన్స్.. కిరాక్ పెర్ఫార్మెన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కొవిడ్ బాధితుల‌కు ఉల్లాసం క‌లిగించ‌డంతోపాటు.. వైద్యులు సైతం రిలీఫ్ ఫీల‌వ‌డానికి ఈ డ్యాన్స్ సూప‌ర్బ్ మెథ‌డ్ అంటూ అభినందిస్తున్నారు.