Begin typing your search above and press return to search.

సీఎం జగన్ కి లేఖ రాసిన డాక్టర్స్ అసోసియేషన్!

By:  Tupaki Desk   |   14 July 2020 12:45 PM GMT
సీఎం జగన్ కి లేఖ రాసిన డాక్టర్స్ అసోసియేషన్!
X
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి కరోనా భారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే ఏపీలో కరోనా భాదితుల సంఖ్య 30 వేలు దాటిపోయింది. దీనితో ప్రభుత్వం కూడా అప్రమత్తమై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ సీఎం జగన్ కి ఓ లేఖ రాశారు. కరోనా పై యుద్ధ చేస్తున్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఆ లేఖలో సీఎం జగన్ ను కోరారు.

అలాగే కరోనా భాదితులకు చికిత్స అందిస్తూ చనిపోయిన డాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించ లేదు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా చనిపోయిన డాక్టర్స్ ‌కి కోట్ల రూపాయల పరిహారం ఒక్కొక్కరికి ప్రకటించాలని డాక్టర్స్ అసోసియేషన్. డిమాండ్ చేసింది. డీఎంఈ పరిధిలో ఉన్న వైద్యులకు గత 15 ఏళ్లుగా పీఆర్సీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖలో వెల్లడించింది. డీఎంహెచ్ పరిధి లోని డాక్టర్ల జీతాలకు, డీఎంఈ పరిధిలో ఉన్న మా జీతాలకు ఎంతో తేడా ఉంది. డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్యుల జీతాలు చూసి కుమిలిపోతున్నామని లేఖ లో పేర్కొన్నారు ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.

గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ డాక్టర్లు పదోన్నతులు దక్కలేదు అని , కరోనా పేషెంట్‌ లకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు ఇతర రాష్ట్రాల్లో అన్ని ఇన్సెంటీవ్ లు ఇస్తున్నా ఏపీలో మాత్రం ఇవ్వడం లేదని అసోసియేషన్ తెలిపింది. కరోనా రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు అన్ని అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు సీఎం జగన్‌కు లేఖ రాశారు.