Begin typing your search above and press return to search.

శారీరక సంబంధం కోరుకునే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్డపడుతారా?

By:  Tupaki Desk   |   5 March 2021 4:40 AM GMT
శారీరక సంబంధం కోరుకునే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్డపడుతారా?
X
ఒక వ్యక్తి యవ్వనంలోకి రాగానే రకరకాల కోరికలు బయటపడుతాయి. టీనేజ్ నుంచి యంగ్ ఏజ్ కి మారుతున్న సమయంలో ఆడవారైనా, మగవారైనా చాలా జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు. ఎందుకంటే ఈ వయసులో మనం చేసే పనులతోనే మన జీవితం ఎంటో తెలుస్తుంది. అమ్మాయిల సంగతి పక్కనబెట్టి అబ్బాయిల గురించి మాట్లాడుదాం..

ఒక అబ్బాయి 19 నుంచి 20 ఏళ్ల వయసు రాగానే అతనిలో హార్మోన్ల ఉత్పత్తి అవుతుందని చాలా మంది వైద్యులు తెలుపుతున్న విషయం. ఈ పరిణామ క్రమంలో ఒక అబ్బాయికి అమ్మాయిని చూస్తే ఏవేవో కోరికలు పుట్టుకొస్తాయి. ఆమెతో స్నేహంగా ఉండాలని, లవ్ చేయాలని మనసులో ఆశలు రేకెత్తుతాయి. అయితే ఈ సమయంలో ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలంటే ఏం చేయాలి..? ఎలా ఉండాలి..? అనేది పరిశీలిద్దాం..

అమ్మాయిలు తాము కోరుకునే అబ్బాయిల్లో కొన్ని లక్షణాలుండాలని నిర్ణయించుకుంటారు. కొందరు మినహా దాదాపు అందరూ టీనేజ్ యువతులు అబ్బాయిలు ఇలా ఉంటేనే ఇష్టపడుతారని కొన్నిసర్వే సంస్థలు కూడా తెలుపుతున్నాయి. ముఖ్యంగా మగవారిలో ఆడవారికి నచ్చే గుణం... తనకు అనుగుణంగా ఉండడం. అయితే ఒక అబ్బాయిని ఓ అమ్మాయి బాగా నచ్చితే తనకు అనుగుణంగా ఎలా ఉండాలనే దానిపై నిపుణులు సలహా ఇస్తున్నారు.

తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయాన్ని పట్టించుకోకుండా స్నేహితులతో మందుగొడుతూ.. పీకల్లోతూ తాగడాన్ని ఏ అమ్మాయి సహించదు. కొందరు అమ్మాయిలు లిమిట్ కు ఓకే చెబుతారు. ఆ సమయంలో వారు చెప్పిన విధంగా ఉంటే బెటర్. ఇక మీకిష్టమైన అమ్మాయి చూడడం లేదనుకుని మీరు అశ్లీల చిత్రాలు చూడడం ఏమాత్రం మీ గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోదు. ఎప్పుడూ శారీరక సంబంధం కోరుకునే వాళ్లను వెంటనే పక్కన పెట్టేస్తారు. ఇలా చేయడం అమ్మాయిల దృష్టిలో నేరగాళ్లుగానే చిత్రీకరిస్తారు.

ఇక అబ్బాయిలు అత్యంత ఓపికగా ఉండాల్సిన సమయం ఏందంటే అమ్మాయి షాపింగ్ చేసేటప్పుడు. ఆ సమయంలో ఏమాత్రం కసురుకున్నా వారికి ఇరిటేడ్ వస్తుంది. దీంతో బ్రేకప్ చెప్పేసినా చెప్పేస్తారు. అంతేకాకుండా వారికి డ్రెస్ నచ్చేదాక వెయిట్ చేయక తప్పదు. ఇక అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే మరో ట్రిక్ సెన్సాఫ్ హ్యూమర్. కామ్ గా ఉన్న వాతావరణంలో జోకులు వేస్తూ నవ్వించాలి. సీరియస్ గా మాట్లాడితే అమ్మాయిలకు అస్సలు ఇష్టం ఉండదు. ఇలా కొన్ని విషయాల్లో అమ్మాలకు నచ్చేట్లు ఉంటే మీరు కోరుకున్న అమ్మాయిని కచ్చితంగా దక్కించుకుంటారు.