Begin typing your search above and press return to search.

ఏ వ్యాక్సిన్ లో ఎంత పాజిటివిటీ రేట్ ఉందో తెలుసా..!

By:  Tupaki Desk   |   8 May 2021 4:52 AM GMT
ఏ వ్యాక్సిన్ లో ఎంత పాజిటివిటీ రేట్ ఉందో తెలుసా..!
X
ప్రపంచం మొత్తం కరోనా కల్లోలంలో చిక్కుకుంది. వేల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. జనాన్ని కాపాడేందుకు కోసం అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందుకోసం ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టాయి. అయితే ఇటీవల తరచూ వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా తర్వాత కరోనా సోకు తుండటం అందరూ గమనిస్తున్నారు. ఒక డోసు వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి, రెండో డోసు వేసుకున్న వారికి కూడా వైరస్ సోకుతోంది.

కొందరు రోగులయితే రెండు డోసులు వేసుకున్నప్పటికీ చనిపోయినవారు వున్నారు. దీంతో అసలు వ్యాక్సిన్ పని చేస్తుందా లేదా... అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరైతే వ్యాక్సిన్ సరిగా పని చేయడం లేదంటూ భావిస్తున్నారు. అసలు ఏమాత్రం పనిచేయని టీకాలు ఎందుకు వేస్తున్నారంటూ మరికొంతమంది ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు వ్యాక్సిన్ పనితీరుపై స్పష్టత ఇచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా సోకకుండా ఉండదని వారు చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటంటే... వైరస్ తో పోరాడే శక్తి శరీరానికి వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది. తద్వారా వైరస్ ఇతర కణాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది.

వ్యాక్సిన్ వేసుకొని వారు ప్రాణాంతక పరిస్థితులు వస్తే వైరస్ తో పోరాడలేక చనిపోతుంటారు. అదే వ్యాక్సిన్ తీసుకున్నవారికి అలాంటి పరిస్థితులు సంభవిస్తే.. ప్రాణం మాత్రం పోదు. శరీరం చివరి వరకు వైరస్ తో పోరాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో పూణే లోని సీరమ్ ఇనిస్టి ట్యూట్ కోవిషీల్డ్ , హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రెండు వ్యాక్సిన్ లను ప్రస్తుతం దేశ ప్రజలకు వేస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్ లో ఏ వ్యాక్సిన్ కు ఎంత పాజిటివ్ శాతం ఉందో తెలుసు కుందాం.

కోవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకున్నవారు 17,37,178 మంది కాగా వీరిలో 695(0.04 శాతం ) మందికి మాత్రమే కోవిడ్ సోకింది. కోవాగ్జిన్ దేశంలో 93,56,436 మంది తీసుకోగా, వీరిలో 4,208(0.04) మంది మాత్రమే వైరస్ బారిన పడ్డారు. కోవిషీల్డ్ ఇప్పటి దాకా 10,03,02,745 మంది ఫస్ట్ డోస్ తీసుకోగా వారిలో 17,145(0.02శాతం ) మందికి మాత్రమే కోవిడ్ సోకింది. కోవిషీల్డ్ రెండో డోస్ 1,57,32,754 మంది తీసుకోగా, వారిలో 5014(0.03) మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు.