Begin typing your search above and press return to search.

తెలంగాణాలో నడుస్తున్న 54, 44, 14, 7 నెంబర్లేమిటో తెలుసా ?

By:  Tupaki Desk   |   1 July 2022 5:30 PM GMT
తెలంగాణాలో నడుస్తున్న 54, 44, 14, 7 నెంబర్లేమిటో  తెలుసా ?
X
షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయపార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షన్ కూడా రోజు రోజుకు తగ్గుతోంది, మళ్ళీ పెరిగిపోతోంది. రోజుకో సర్వే పేరుతో బయట చక్కర్లు కొడుతున్న నెంబర్లు నేతల గుండెల్లో గుబులు పెంచేస్తోంది. దాంతో ఏది నిజమైన సర్వేనో లేకపోతే ఏది అబద్ధపు సర్వేనో అర్ధంకాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఏదో ఒకపార్టీనే అధికారంలోకి రాగలదు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలూ అధికారం తమదే అని చెప్పేసుకుంటున్నాయి.

పై మూడుపార్టీల థీమా చూసిన తర్వాత ఆయా పార్టీల్లోని నేతలకు పిచ్చెక్కిపోతోంది. నేతల పరిస్ధితి ఇలాగుంటే ఇక మామూలు జనాల సంగతి ఎలాగుంటుందో ఊహించుకోవచ్చు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటేనే ఎంఎల్ఏల్లో గుబులు పెరిగిపోతోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ నుండి ఎంతమంది సిట్టింగులు ఇతర పార్టీల్లోకి జంపయిపోతారో అర్ధం కావటంలేదు. ఎందుకంటే కేసీయార్ చేయించుకున్న సర్వే ప్రకారం చాలామందికి టికెట్లు దక్కవనే ప్రచారం అందరికీ తెలిసిందే.

మరి టికెట్లు దక్కనివారు ఏమి చేస్తారు. చేతులుముడిచుకుని అయితే కూర్చోరుకదా. అవకాశం ఉన్న పార్టీలోకి జంపయిపోతారు. టికెట్ అవకాశం ఉన్న పార్టీలంటే ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మాత్రమే. అందుకనే టీఆర్ఎస్ ఎంఎల్ఏల చూపులు పై రెండుపార్టీల మీదకూడా ఉన్నాయట. టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారమైతే 50 శాతంమందికి టికెట్లు దక్కవట. సగానికి సగంమందికి టికెట్లు కష్టమనే సంకేతాలు ఇప్పటికే కేసీయార్ కోటరి నుండి వస్తున్నది. దీంతో అధికారపార్టీలో ఉండేదెవరో, వెళ్ళిపోయేదెవరో అర్ధంకాక అందరు తలలు పట్టుకుంటున్నారు.

టీఆర్ఎస్ లాగే కాంగ్రెస్, బీజేపీ పార్టీల చీఫులు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. పార్టీలే కాకుండా ఎంఎల్ఏలు కూడా వ్యక్తిగతంగా సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ సర్వేల మీద నమ్మకంలేకుండా మళ్ళీ ఇంకో థర్డ్ పార్టీతో కూడా సర్వేలు చేయించుకుంటున్న ఎంఎల్ఏలున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నెల్లూరుకు చెందిన సర్వే సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారట.

సర్వేల్లో హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ చేయించుకున్న సర్వేల్లో చాలావరకు అధికారపార్టీయే గెలుస్తుందనొచ్చింది. అయితే ఒక సర్వేలో మాత్రమే ఈటల గెలుస్తారని వచ్చిందట. అందుకనే క్రాస్ చెక్ చేయించుకుంటున్నారు ఎంఎల్ఏలు. ఇపుడు చక్కర్లు కొడుతున్న నెంబర్లప్రకారమైతే కాంగ్రెస్ కు 54, టీఆర్ఎస్ 44, బీజేపీకి 14, ఎంఐఎంకు ఏడు సీట్లొస్తాయట. బాగా కష్టపడితే టీఆర్ఎస్ కు 60 వరకు రావచ్చని తేలిందట. మరి కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.