Begin typing your search above and press return to search.

ఈ ప్రముఖ సంస్థల సెకను సంపాదన తెలిస్తే అవాక్కే?

By:  Tupaki Desk   |   23 Feb 2021 5:30 PM GMT
ఈ ప్రముఖ సంస్థల సెకను సంపాదన తెలిస్తే అవాక్కే?
X
కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇంటికే పరిమితమై ఉద్యోగ, ఉపాధి కోల్పోయి రూపాయి సంపాదన లేక నానా అగచాట్లు పడుతున్న వేళ కూడా ఆన్ లైన్ ఈకామర్స్ దిగ్గజం మాత్రం ఊహించని లాభాలను ఆర్జించింది. ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండి ఈ ఈకామర్స్ సైట్ ద్వారా తిండి బట్టలు, వస్తువులు తెప్పించుకున్నారు. మన ఉన్న డబ్బులన్నీ అయిపోతే అమెజాన్ అధిపతి బెజోస్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత కుబేరుడయ్యాడు.ఇలా అమెజాన్ యే కాదు.. ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ ప్రపంచదేశాల ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా.. ఆదాయం కోల్పోయిన కూడా వాటి సంపాదన మాత్రం ఏమాత్రం కరుగకపోవడం గమనార్హం.

ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు అమేజాన్ అధినేత బెజోస్ సంపాదన సెకనుకు ఎంతో తెలిస్తే నిజంగానే నోరెళ్లబెడుతారు. అదేకాదు పేరు మోసిన ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సంపాదన సెకనుకు.. అంటే కళ్లు మూసి తెరిచేలోగా ఎంతో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు..

అమెజాన్ కామ్ సంపాదన ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఆ సంస్థ సెకను సంపాదన ఏకంగా 15699 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపుగా 11.38 లక్షలన్నమాట.. సెకనుకే 11 లక్షల సంపాదన అంటే నిమిషానికి ఎంత?.. గంటలకు ఎంత అయ్యి ఉంటుంది? రోజుకు ఇంకెంతనో ఊహించుకోవచ్చు.

అమెజాన్ ప్రపంచంలోనే అత్యధిక సంపాదన గల కంపెనీగా ఉండగా.. ఆ తర్వాత అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్ల కంపెనీ ఆపిల్ సెకను సంపాదన 14331 డాలర్లుగా ఉంది. దాదాపు వెయ్యి తేడాతో ఈ రెండు కంపెనీలు భారీగానే ఆర్జిస్తున్నాయి.ఇక ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ సెకన్ సంపాదన 7237 డాలర్లు, ఆ తర్వాత సామ్ సంగ్ 7072 డాలర్లు, మైక్రోసాఫ్ట్ 5479 డాలర్లు, ఫేస్ బుక్ 3570 డాలర్లు, టెస్లా 1367 డాలర్లు, నెట్ ఫ్లిక్స్ 845 డాలర్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉంది.