Begin typing your search above and press return to search.

అద్భుతం .. రాత్రి ఎలా అవుతుందో తెలుసా!

By:  Tupaki Desk   |   20 Sep 2021 6:39 AM GMT
అద్భుతం .. రాత్రి ఎలా అవుతుందో తెలుసా!
X
అంతరిక్ష పర్యాటకాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రైవేట్ స్పేస్ కంపెనీలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షంలోకి వ్యోమనౌకలను పంపించాయి. ఈ జాబితాలో స్పేస్‌ ఎక్స్ సైతం చేరింది. సెప్టెంబర్ 15న నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుంచి నలుగురు వ్యోమగాముల బృదం అంతరిక్షయాత్రకి వెళ్లారు. ఇన్‌స్పిరేషన్ 4 మిషన్‌లో భాగంగా అమెరికన్ బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మన్ నేతృత్వంలోని మొత్తం నలుగురు పౌరుల బృందం అంతరిక్ష యాత్ర చేపట్టారు. ఎలాన్ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్ కంపెనీ నిర్మించిన రాకెట్‌ లో వీరు భూమి ‘లో ఎర్త్ ఆర్బిట్‌’ కు వెళ్లారు. ఇది గతంలో ఇద్దరు బిలియనీర్లు జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలోకి వెళ్లిన దూరం కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.

తాజాగా ఈ సంస్థ అంతరిక్షంలోకి డ్రాగన్ క్యూ బోలా అనే అంతరిక్ష నౌకను ప్రవేశ పెట్టింది. ఈ స్పేస్ షిష్ ద్వారా అంతరిక్షం నుంచి భూగ్రహానికి అద్భుతంగా ఫొటోలు, వీడియోలు తీయొచ్చు. భూమి అందాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి కెమెరాల్లో బందించడానికి వీలుగా డ్రాగన్ క్యూబోలాను 580 కిలో మీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఐఎస్‌ ఎస్‌ భూమికి 400 కిలోమీటర్లు, హబుల్ స్పేస్ టెలిస్కోప్ 560 కిమీల ఎత్తులో ఉంది. నింగిలోకి దూసుకెళ్లే నలుగురు సిబ్బంది భూమి ‘లో ఎర్త్ ఆర్బిట్’ (LEO) కు వెళ్లనున్నారు. ఇది భూమి నుంచి సుమారు 2000 కిలోమీటర్లు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రపంచ దేశాలు ప్రయోగించే శాటిలైట్‌లు చాలా వరకు ఈ కక్ష్యలోనే ఉంటాయి.

సెప్టెంబర్ 15న ఇన్సిపిరేషన్ 4 మిషన్‌ లో భాగంగా డ్రాగన్ క్యూ బోలాను ప్రయోగించారు. ఈ మానవ సహిత స్పేస్-ఎక్స్ అంతరిక్ష నౌకలో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణించారు. వీరంతా ఇప్పుడు అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ డ్రాగన్ స్పేస్ షిప్‌ లోనే ఉన్నారని సమాచారం. నిజానికి గతంలో పలు అంతరిక్ష సంస్థలు భూగోళాన్ని పై నుంచి చూసేందుకు వీలుగా స్పేస్ షిప్‌ లను పంపించారు. కానీ భూమిని సరిగ్గా వీక్షించేందుకు వాటిలో ఏ ఒక్కటీ కూడా అనువుగా ఉండలేదు. ఇప్పుడు స్పేస్-ఎక్స్ సంస్థ ఇన్సిపిరేషన్ 4 మిషన్‌ లో భాగంగా ట్రాన్స్‌ పర్ మెటీరియల్‌ ను ఉపయోగించారు. అంతేకాకుండా భూమి చక్కగా కనిపించేందుకు క్యూ బోలాను చాలా పెద్దగా రూపొందించారు. దాంతో అంతరిక్షం నుంచి భూమిని స్పష్టంగా చూసేందుకు సాధ్యపడింది. తాజాగా డ్రాగన్ క్యూబోలా ప్రయాణికులు భూమిపై చీకటి పడుతుండగా ఎలా ఉంటుందో అందరికి చూపించేందుకు భూమిపై చీకటి పడే దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం ఆ వీడియోను స్పేస్ ఎక్స్ సంస్థ ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన అతిపెద్ద ఫాల్కన్ 9 రాకెట్‌.. రిసైలెన్స్ క్యాప్సూల్‌ ను నింగిలోకి తీసుకెళ్ళింది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ అనేది రిఫ్లైట్ చేయగల మొదటి ఆర్బిటల్ క్లాస్ రాకెట్. భూమి కక్ష్యలోకి, కక్ష్యను దాటి మనుషులను తీసుకెళ్లగలదని, పేలోడ్‌లను రవాణా చేయగలదని ఆ సంస్థ వెల్లడించింది. నలుగురు యాత్రికులతో 3 రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్‌ ‘స్పేస్‌ క్యాప్సుల్‌’ సురక్షితంగా భూమికి చేరింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటలకు ఫ్లోరిడాలోని సముద్రంలో దిగింది. గంట తర్వాత యాత్రికులు అందులో నుంచి చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు. దీనిని స్పేస్‌ ఎక్స్‌ యూట్యూబ్‌ చానల్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్‌ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్ (29)‌, టీవీ నటి సియాన్ ప్రోక్టర్ (51), ఏరోస్పేస్‌ డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ (42), జారెడ్ ఐజాక్‌ మన్ (38) స్పేస్‌ ఎక్స్‌ వాహక నౌక డ్రాగన్ ‘స్పేస్ క్యాప్సూల్‌’ ద్వారా బుధవారం రాత్రి ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లారు.