Begin typing your search above and press return to search.

కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా .. ఎన్నో ప్రయోజనాలు?

By:  Tupaki Desk   |   25 Sep 2021 1:30 AM GMT
కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా .. ఎన్నో ప్రయోజనాలు?
X
కరివేపాకును చాలా మంది చిన్నచూపు చూస్తారు. ప్లేట్ లో కనిపించగానే తీసి పక్కన పెడతారు. అయితే, కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్యా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుని కరివేపాకును ఇప్పటి నుంచి పడేయకుండా తినండి. కరివేపాకు ఆహారం రుచి మరియు వాసన పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే కరివేపాకు లో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఆహారంలో కరివేపాకు వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కరివేపాకు ఆకులు శరీరానికి అవసరమైన విటమిన్ ఏ మరియు సీ ని సరఫరా చేస్తాయి. మీరు మీ ఆహారంలో కరివేపాకు వేస్తే అది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా తగ్గుతుంది. అదనంగా ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. కరివేపాకు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. కరివేపాకు మనం అధికంగా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

హెల్త్‌ లైన్ నివేదిక ప్రకారం.. కరివేపాకులో మెదడుతో సహా మీ నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు ఉంటాయి. కరివేపాకుతో పాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకు కూడా చర్మానికి మేలు చేస్తుంది. ఈ ఆకులను నీటితో ఉడకబెట్టడం మరియు దానితో స్నానం చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల సమస్య పరిష్కారమవుతుంది.

8-10 కరివేపాకు ఆకులు, చిన్న అల్లం ముక్కను నీళ్లలోవేసి 15 నుంచి 20 నిముషాలు మరగనియ్యండి. దీనిపై మూతను పెట్టి 10 నిముషాలు పక్కన పెట్టండి. తర్వాత వడకట్టి తాగండి. రుచికోసం దీనికి నిమ్మరసం, తేనెకూడా జోడించవచ్చు. ఇలా తయారు చేసిన టీని రోజు మొత్తంలో ఎ‍ప్పుడైనా తాగవచ్చు. అలాగే వివిధ రకాల వంటకాలలో కరివేపాకును చేర్చడం ద్వారా, కరివేపాకు పచ్చడి, లస్సీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రతి రోజూ పిడికెడు కరివేపాకు ఆకులను నేరుగా తిన్నా మంచిదే.

అజీర్తి, విరేచనాలు, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను కరివేపాకు తినడం ద్వారా నయం చేయవచ్చు. ఈ ఆకులు ఎక్కువ జీర్ణ ఎంజైమ్‌లతో నిండి ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా కరివేపాకు కీలకప్రాత పోషిస్తుందని గతంలో రిపోర్టులు పేర్కొన్నాయి. భారత్‌ లో కనిపించే, పెరిగే ఔషధ మూలికలలో కరివేపాకు ఒకటిగా వైద్య నిపుణులు భావిస్తారు. వంటలు రుచికరంగా అయ్యేందుకు కూడా కరివేపాకును వంటల్లో వాడుతుంటారు.