Begin typing your search above and press return to search.

నన్ను విష్ చేసే ధైర్యం చేస్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈటల పంచ్!

By:  Tupaki Desk   |   6 Feb 2023 5:00 PM GMT
నన్ను విష్ చేసే ధైర్యం చేస్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈటల పంచ్!
X
వార్షిక బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు ఆరంభం నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి కేటీఆర్ అసెంబ్లీ హాల్లో ఈటల అండ్ కో వద్దకు తానే వెళ్లి స్వయంగా మాట్లాడటం తెలిసిందే. ఇదొక ఆసక్తికర పరిణామం అయితే.. తాజాగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్న వేళ.. బీజేపీ ఎల్పీ కార్యాలయం నుంచి నడిచి వెళుతున్న ఈటల రాజేందర్ ను.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విష్ చేశారు.

అయితే.. మర్రి చేసిన విష్ ను ఈటల గుర్తించలేదు. దీంతో.. ఆయనే స్వయంగా ఈటల వద్దకు వెళ్లి మరీ విష్ చేశారు. దీంతో ఆశ్చర్యపోవటం ఈటల వంతైంది. 'ఏంది ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను విష్ చేసే దైర్యం చేస్తారా?' అని ఒకింత ఆశ్చర్యంతో ప్రశ్నించారు ఈటల. దీనికి బదులిచ్చిన జనార్దన్ రెడ్డి..రాజకీయాలు వేరు.. మానవ సంబంధాలు వేరు .. విష్ చేసే ధైర్యం ఎందుకు లేదు? ఆలింగనం చేసుకునే ధైర్యం కూడా ఉందంటూ ఆయన్ను ఆత్మీయంగా హగ్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన ఈటల.. ఈ రోజుల్లో విలువలు ఎక్కడ ఉన్నాయి? వేడి నూనెలో వేయించి ఎలా ఉందని అడిగినట్లు ఉంది.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరి వేర్వేరు పార్టీ నేతలు కలిసి మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. తాను నియోజకవర్గ పనుల కోసం మంత్రి హరీశ్ వద్దకు వెళితే.. తాను బీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయని వారిని కలిసిన మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.