ఐటీ రంగంలోకి మళ్లీనా? నో వే అంటున్న టెకీలు

Sat Oct 01 2022 07:00:02 GMT+0530 (India Standard Time)

Do not want the IT sector

మేం చేయం మొర్రో అంటూ ఐటీ రంగంలోని ప్రతిభావంతులంతా ఆ రంగాన్ని వదిలిపెడుతున్నారు. బిజినెస్ లో స్తిరపడి మళ్లీ తిరిగి ఐటీ రంగానికి వచ్చేది లేదంటూ మొండికేస్తున్నారు. మంచి మంచి టాలెంటెడ్స్ అంతా తరలిపోతుండడంతో కంపెనీలకు శరాఘాతంగా మారింది. వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరించే ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టి పెట్టుకోవడం ఐటీ రంగంలో చాలా కష్టంగా మారుతోంది. గత రెండేళ్లుగా మరింత తీవ్రమవుతోంది.



ఐటీ ప్రొఫెషనల్స్ లో చాలా మంది భవిష్యత్తులో ఈ రంగానికి తిరిగి రావద్దు అని భావిస్తుండడమే ప్రధాన కారణంగా ఉంది. ఐటీ రంగానికి నియామకాల సర్వీసులు అందించే టీమ్ లిజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ఉద్యోగుల అవసరాలు ప్రాధాన్యతలు మారిపోయాయి. వారు ఉద్యోగ నిబంధనల్లో సరళత్వం కెరియర్ లో వృద్ధి అవకాశాలు ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు మొదలైన వాటి ఆధారంగా తమ కెరియర్ లను మదింపు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఐటీ రంగంలో రెండంకెల స్థాయిలో 25శాతం మేర అట్రిషన్ నమోదవుతోంది. 100 మందిపైగా నిపుణులు ఐటీ రంగానికి సంబంధించిన వారితో చేసిన ఇంటర్వ్యూల ఆధారంగా టీమ్ లీజ్ ఈ నివేదిక రూపొందించాడు. గడిచిన పదేళ్లుగా దేశీ ఐటీ రంగం గణనీయంగా విస్తరించింది. అత్యంత వేగంగా 15.5 శాతం మేర వృద్ధితో 227 బిలియన్ డాలర్ల స్తాయికి చేరింది. 2022 ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా 5.5 లక్షల ఉద్యోగాలను కల్పించిందని టీమ్ లీజ్ పేర్కొంది.

అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐటీ నియామకాల ధోరణిలో పెనుమార్పులు వచ్చాయి. వ్యాపారాలకు కీలకమైన ప్రతిభావంతులను అట్టే పెట్టుకోవడం ఐటీ కంపెనీలకు గత రెండేళ్లుగా కష్టంగా మారుతోంది. సర్వే ప్రకారం.. 57 శాతం మంది ప్రొఫెషన్స్ భవిష్యత్తులో ఐటీ సర్వీసుల రంగానికి తిరిగివచ్చే యోచన లేదని తెలిపారు. జీతాల పెంపు ఇతర ప్రయోజనాలు ఎలాగూ ఉండేవే అయినా ఉద్యోగాలు మారడంతో కొత్త సంస్థల అంతర్గత విధానాలు కూడా ఉద్యోగులకు ఆకర్షణీయంగా ఉంటున్నాయని సర్వే  పేర్కొంది.

ఈ నేపథ్యంలో పని వ్యక్తిగత జీవితం గురించి ఉద్యోగుల అభిప్రాయాల్లో వస్తున్న మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని కంపెనీలు తమ విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటుందని సర్వే సంస్థ సూచించింది. ఉద్యోగులు వారి అభ్యున్నతి లక్ష్యంగా కంపెనీల నియామక ప్రణాళికలు వ్యూహాత్మకంగా ఉండాలని పేర్కొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.