Begin typing your search above and press return to search.

కరోనా చికిత్సకు ఔషధం వాడొద్దు

By:  Tupaki Desk   |   19 Jan 2022 11:30 PM GMT
కరోనా చికిత్సకు ఔషధం వాడొద్దు
X
కరోనా వైరస్ రోజు రోజుకు మన దేశంలో విస్తరిస్తోంది. ఈ క్రమంలో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 2.8 లక్షలకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. అంతేగాకుండా 4 వందలకు పైగా మంది వైరస్ కారణంగా చనిపోయారు. మరోవైపు దేశంలో రోజు వారి పాజిటివిటి రేటు భారీగా పెరిగింది. నేడు కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం దేశంలో రోజు వారి పాజిటివిటీ రేటు సుమారు 15 శాతం దాటింది. ఈ క్రమంలోనే ఐసీఎంఆర్... కరోనా చికిత్సకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై కోవిడ్ చికిత్సలను ఏమాత్రం స్టెరాయిడ్స్ ను ఉపయోగించకూడదని పేర్కొంది కోవిడ్ రెండో వేవ్ సమయంలో వీటి ఉపయోగం అనేక అనర్థాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఐసీఎంఆర్ ప్రతినిధులు పేర్కొన్నారు.

కరోనా వైరస్ రెండో వేవ్ లో సృష్టించిన కల్లోలాన్ని తట్టుకునేందుకు చాలామంది ప్రజలు స్టెరాయిడ్లు ఉపయోగించారు. అయితే ఇవి మోతాదుకు మించి ఉపయోగించినట్లు తర్వాత తెలిసింది. ఈ కారణంగా కరోనా వచ్చిన రోగికి అతి తక్కువ సమయంలోనే బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. దేశంలో మరో సారి కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. ఈ కారణంగా తిరిగి కరోనా చికిత్స కోసం ప్రజలు స్టెరాయిడ్లు ఉపయోగిస్తారు అనే భావనతో అప్రమత్తమైన ఐసీఎంఆర్ ప్రతినిధులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కరోనా చికిత్స కోసం ఉపయోగించకూడదని తేల్చిచెప్పారు.

ఐసీఎంఆర్ చెప్పినదాని ప్రకారం... కోవిడ్ చికిత్సలో కేవలం ఔషధాలను మోతాదుకు మించి తీసుకోవడం కారణంగా ఇతర వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు వారాలకు మించి దగ్గు ఉన్నట్లయితే వెంటనే టీబీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు. దగ్గు ఎక్కువగా ఉన్నట్లయితే అది కొవిడ్ కి కూడా దారితీస్తుందని పేర్కొన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు. అలా అని ప్రతి దానికి స్టిరాయిడ్ల వాడకం మంచిది కాదని తెలిపారు. అనవసరంగా ఇతర మందులను తీసుకోవడం అనేది దుర్వినియోగం చేయడంలో భాగమే అని చెప్పారు.

ఆక్సిజన్ సాచ్యురేషన్ ని 90 కంటే తక్కువ కాకుండా చూసుకోవాలని ఐసీఎంఆర్ కరోనా టాస్క్ ఫోర్స్ చీఫ్ వి కే పౌల్ సూచించారు. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి అని తెలిపారు. రోగి ఉన్న పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని సూచించారు మరీ ప్రమాదకరం గా మారితే వెంటనే ఐసియూకి తరలించేలా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.