వామ్మో.. బయటకు రావాల్సిన రాసలీలల వీడియోలు అన్ని ఉన్నాయా?

Sun Mar 07 2021 10:37:18 GMT+0530 (IST)

Do not broadcast our video .. RGs of six ministers

కర్ణాటక అధికారపక్షానికి వీడియోల భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఒక మంత్రిగారి రాసలీలల సీడీ బయటకు రావటం.. మీడియా.. సోషల్ మీడియాలో పెనుసంచలనంగా మారటమే కాదు.. తాజాగా సదరు మంత్రి తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారి తీరుపై పులు సందేహాలు పుట్టుకొస్తున్నాయి.ఇంతకీ ఆరుగురు మంత్రుల డిమాండ్ ఏమిటో తెలుసా? తమకు సంబంధించిన ఏమైనా వీడియోలు ఉంటే.. ముందు తమకు చెప్పాలని.. అంతే తప్పించి నేరుగా టెలికాస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆర్జీలు పెట్టుకున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కర్ణాటక అధికారపక్ష నేతల తీరుపై విపక్ష నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

ఆరుగురు మంత్రుల వినతికి రాష్ట్ర హైకోర్టు సానుకూల స్పందించింది. తాత్కాలిక అనుమతులు ఇచ్చింది. ఇంతకీ తమ వీడియోల్ని ప్రసారం చేయొద్దని కోరిన మంత్రుల విషయానికి వస్తే.. శివరాం హెబ్బార్.. బీసీ పాటిల్.. హెచ్ టీ సోమేశేఖర్.. కె.సుధాకర్.. నారాయణగౌడ.. బైరతి బసవరాజు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆరుగురు మంత్రులు తాజాగా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమకు సంబంధించిన వీడియోల్ని మీడియాలో ప్రసారం చేయొద్దని కోరారు. కీలకమైన మంత్రి పదవుల్లో ఉంటూ తమ వీడియోలను టెలికాస్ట్ చేయొద్దని డిమాండ్ చేయటం చూస్తే.. అసెంబ్లీని అవమానించినట్లేనని పేర్కొంటున్నారు. అంటే.. వీరుతప్పు చేశారు కాబట్టి.. వీడియోలు బయటకువస్తే బంగారం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అలా చేశారంటున్నారు. తమ సీడీలను టెలికాస్ట్ చేయొద్దని కర్ణాటక మంత్రులు పలువురు కోర్టును ఆశ్రయించటం సరికాదని కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ వ్యాఖ్యానించారు. మొత్తంగా వీడియో మాట వింటేనే.. కర్ణాటక బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పక తప్పదు.