Begin typing your search above and press return to search.

కొత్తగా పెళ్లయిన మహిళలు గూగుల్ ఏం వెతుకుతున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   28 Jun 2022 11:30 PM GMT
కొత్తగా పెళ్లయిన మహిళలు గూగుల్ ఏం వెతుకుతున్నారో తెలుసా?
X
మనం ప్రతి రోజు ఏం తినాలి..? ఏరోజు ఎటు వెళ్లాలి..? ఏ పని చేయాలి..? ఎలా బతకాలి..? ఇలాంటి ప్రతీ ప్రశ్నకు సమాధానం మనకు చదువు చెప్పిన గురువు కూడా చెప్పలేరు..కానీ గూగుల్ తల్లీ దగ్గర అన్ని సమాధానాలుంటాయి. మనకు కావాల్సిన ప్రతీ ప్రశ్నకు ఏదో ఒక జవాబు కచ్చితంగా ఇచ్చి తీరుతుంది.. విద్యార్థుల నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తమ సమస్య పరిష్కారం కోసం గూగుల్ ను ఆశ్రయిస్తున్నవారే. అలాంటి గూగుల్ మానియా ఇప్పుడు పచ్చని కాపురంలోకి అడుగు పెట్టింది.

కొత్తగా పెళ్లయిన వారికి కాపురం ఎలా చెయ్యాలి..? అనే విషయాన్ని కూడా చెబుతుందట..! అయితే గూగుల్ నుంచి ఆన్సర్ రావాలంటే కొశ్చెన్ వేయాలి. మరి సంసారం ఎలా చేయాలి..? అనే కొశ్చెన్ ఎవరు వేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..

నేటి కాలం ప్రజలు ప్రతీ విషయం కోసం గూగుల్ పైనే ఆధారపడుతున్నారు. ఒక దశలో గూగుల్ లేకపోతే కొన్ని సంస్థలు కూడా నడవని పరిస్థితి. అయితే ఒకప్పడు ఏదైనా సందేహం ఉంటే ఇంటిపక్కవాళ్లను, లేదా పండితులను అడిగేవాళ్లు. కానీ ఇప్పడు ఇతరులతో సంబంధం లేకుండా చేతిలో ఉన్న గూగుల్ లో కొట్టేస్తున్నారు.

ఇక గూగుల్ లో ఒకప్పుడు ఇంగ్లీషు లాంగ్వేజ్ మాత్రమే ఉండడం జనాల్లోకి బాగా రాలేదు. కానీ ఇప్పుడు అన్ని భాషల్లోనూ వాడుకునే అవకాశం ఇస్తుండడంతో చాలా మంది ఇంట్లో ఉండే మహిళలు కొత్త కొత్త వంటలను నేర్చుకుంటున్నారు. అయితే తాజాగా ఓ సంస్థ ఇచ్చిన రిపోర్టులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నివేదికలో కొత్తగా పెళ్లయిన ఆడవాళ్లు సంసారం ఎలా చెయ్యాలి..? అనే కొశ్చెన్స్ వేస్తున్నారట. పుట్టినప్పటి నుంచి చదువు, కెరీర్ అని బిజీగా మారిన యువతులు ఇతరులతో సంబంధం లేకుండా పెరిగి పెద్దయ్యారు. దీంతో పురాతన రోజుల్లాగా ఇప్పటి వారికి సంసారం ఎలా చెయ్యాలనే అవగాహన ఉండడం లేదు. దీంతో ఇతరులను అడగడం బిడియంగా ఉండడంతో గూగుల్ ను ఆశ్రయిస్తున్నారట. సంసారం ఎలా చెయ్యాలి..? అనే దానితో పాటు భర్తను ఎలా అదుపులో పెట్టుకోవాలి..? భర్త మనసును ఎలా గెలుచుకోవాలి..? ఎలా సంతోషపెట్టాలి..? అత్తగారితో ఎలా ఉండాలి..? కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి..? పెళ్లయ్యాక ఎలాంటి వ్యాపారం చేయలి..? లాంటి ప్రశ్నలు అడుగుతున్నారట.

సాధారణంగా ప్రతీ అమ్మాయి జీవితం రెండు భాగాలుంటుంది. ఒకటి పెళ్లికి ముందు.. మరొకటి పెళ్లయిన తరువాత.. పెళ్లికి ముందు తల్లిదండ్రులపై ఎక్కువగా ఆధారపడేవారు కొందరైతే.. తమ చదువు, కెరీర్ పై దృష్టిపెట్టేవారు మరికొందరు. ఈ క్రమంలో ఎక్కువగా ఇతర విషయాలు పట్టించుకోకుండా కేవలం లక్ష్యంపై మాత్రమే గురిపెడుతున్నారు.

దీంతో ఇలాంటి విషయాలు వారు తెలుసుకోలేకపోతున్నారు. అయితే పెళ్లి చేసుకునే వయసు వచ్చాక ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఒకవేళ అడిగినా ఈ విషయం కూడా తెలియదా..? అని అనుకుంటారని భావిస్తున్నారు. దీంతో గూగుల్ ను అడిగేస్తే పోలా..? అని పెళ్లయిన మహిళలు గూగుల్ ను ఆశ్రయిస్తున్నారట.