Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ : డయల్ 100 కి ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా ?

By:  Tupaki Desk   |   8 April 2020 11:30 PM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ : డయల్ 100 కి ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా ?
X
కరోనా వైరస్ దృష్ట్యా మార్చి 23 నుండి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉంది. కరోనాను అరికట్టడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే కావడంతో .. లాక్ డౌన్ ను విధించక తప్పలేదు. అయితే, ఈ లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం అవసరమైన వస్తువుల సరఫరాను అనుమతించింది. నిత్యావసర సరుకుల దుకాణాలు - మెడికల్ స్టోర్స్ - హాస్పిటల్స్ కి అనుమతి ఇచ్చింది. అలాగే, ప్రజలకి ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే .. 'డయల్ 100' చేయమని ప్రజలను కోరారు.

కానీ ప్రజలు ఈ 'డయల్ 100' ను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు. కాగా , తెలంగాణ లో లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి పోలీసు శాఖకు 12 లక్షల కాల్స్ వచ్చాయి. అయితే , ఇందులో కేవలం 78,039 కాల్స్ మాత్రమే సరైన కారణాలతో వచ్చినవి - మిగిలిన కాల్స్ మొత్తం నకిలీవే. తమకు రోజుకు 10,000 నుండి 20,000 కాల్స్ వస్తాయని, వాటిలో ఎక్కువ నకిలీ కాల్స్ అని పోలీస్ శాఖ వారు తెలిపారు. ముఖ్యంగా, ప్రస్తుతం ఉన్న యువత 'డయల్ 100' కి కాల్స్ చేసి - ఏవో కారణాల వల్ల పోలీసులని ఆటపట్టిస్తున్నారు.

ఇకపోతే , ఆ కాల్స్ లో కరోనా అనుమానితులపై - పోలీసులకు 2418 కాల్స్ వచ్చాయి. ఇంకా పోలీసులు అన్ని కాల్‌లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని, ఈ సమయంలో డయల్ 100 కి , సరైన కారణం లేకుండా కాల్ చేయవచ్చు అని పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నకిలీ కాల్స్ చేస్తే - అదే సమయంలో మరొకరు నిజంగా చేసినప్పుడు - వారికీ పోలీస్ సహాయం అందకపోవచ్చు అని , కాబట్టి దయచేసి ఆలా చేయకండి అని కోరారు. అయితే , ఈ లాక్ డౌన్ సమయంలో విశ్రాంతి అన్నది లేకుండా పనిచేస్తున్న పోలీసుల విలువైన సమయాన్ని వృధా చేసే వారిపై పోలీసులు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పలువురు కోరుతున్నారు.