Begin typing your search above and press return to search.

వైసీపీ విజయంలో ఆమెది కీలకపాత్ర

By:  Tupaki Desk   |   24 May 2019 11:49 AM GMT
వైసీపీ విజయంలో ఆమెది కీలకపాత్ర
X
వైసీపీ గెలిచింది.. అదీ మాములుగా కాదు.. ఏపీ ఎన్నికల రికార్డులను బద్దలు కొట్టేలా.? అరవీర భయంకరమైన టీడీపీ ఆనవాళ్లు కూడా లేకుండా.? మొత్తం 175 సీట్లకు 151 సీట్లలో గెలుపు. దాదాపుగా క్లీన్ స్వీప్.. 30 ఏళ్ల టీడీపీ చరిత్రలోనే భారీ ఓటమి. అయితే ఈ విజయం గాలివాటం కాదు.. ఎంతో మంది కృషి ఉంది. జగన్ పాదయాత్ర జనాలను కదిలించింది. ఇక అనుకూల టీడీపీ మీడియాతో అభూతకల్పనలు ప్రచారం చేస్తూ వైసీపీని దెబ్బకొట్టాలన్న వ్యూహాన్ని అంతే ధీటుగా ఎదుర్కొంది వైసీపీ సోషల్ మీడియా టీం. ఈ ఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా కుట్రలను చిత్తు చేసి ప్రజలకు వాస్తవాలు వివరించి జగన్ కు తోడుగా నిలిచిన వైసీపీ సోషల్ మీడియా నడిపించింది ఒక మహిళ.. వైసీపీ గెలుపులో ఆమె పాత్ర మరువలేనది.దివ్యారెడ్డి.. వైఎస్ఆర్ సీపీ అఫీషియల్ డిజిటల్ మీడియా హెడ్ (డీఎంవో) .

వైసీపీ విజయంలో సోషల్ మీడియా పాత్ర కాదనలేనిది. సోషల్ మీడియా ఈ ఎన్నికల్లో ఎంతో కీరోల్ పోషించింది. ఎప్పటికప్పుడు టీడీపీ ని టార్గెట్ చేసి నిజాలను ప్రజలకు చెబుతూ .. టీడీపీ అవినీతిని అక్రమాలను అన్నింటిని ప్రజల ముందు సోషల్ మీడియా ఉంచింది. వైసీపీ ఒక తిరుగులేని శక్తిగా మారడానికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణం.. లోకేష్ - చంద్రబాబు యూటర్న్ లను - తప్పుడు మోసాలను ప్రజలకు తెలిపింది వైసీపీ సోషల్ మీడియా విభాగం.

ఇదంతా ఒకే సమయంలో గురి తప్పకుండా ఏకకాలంలో జరగడానికి కారణం దివ్యారెడ్డి. ఎంతో ఓర్పుతో.. క్రియేటివ్ ఐడియాస్ తో టీమ్ మేనేజ్ మెంట్ తో సక్సెస్ ఫుల్ గా చివరి నిమిషం వరకు వైసీపీ కోసం ఫైట్ చేశారు. అది బాగా హెల్ప్ అయ్యింది. ఏది కరెక్ట్.. ఏది పార్టీ స్టాండ్.. ఎక్కడ నెగెటివ్ అవుతుంది.. ఎక్కడ ప్లస్ అవుతుంది అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా సోషల్ మీడియా కంటెంట్ ప్లాన్ చేశారు.

పార్టీకి మీడియాకు మధ్యలో వారధి లాగా ఉంటూ ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చేవారు. రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా వాలంటీర్స్ ని కనుక్కొని వాళ్లని యాక్టివ్ అయ్యేలా చేశారు. డైలీ మీటింగ్ పెడుతూ.. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ని రివ్యూ చేస్తూ.. రాష్ట్రం నలుమూలల ఉండే డిజిటల్ వాలంటీర్స్ కి ఇన్ పుట్స్ ఇస్తూ వాళ్లని యాక్టివ్ గా ఎంకరేజ్ చేస్తూ చివరి ఆరు నెలలు ఒక్కరోజుకూడా వృథాకాకుండా దివ్యారెడ్డి మరియు ఆమె టీం వర్క్ చేశారు.

మరో వైపు వాలంటీర్స్ కూడా వైసీపీ వెన్నంటే ఉన్నారు. వాళ్ల అందరినీ డైలీ ఆపరేషన్స్ లో ఇన్ వాల్వ్ చేయడం లో దివ్యారెడ్డి పాత్ర ఎంతో ఉంది. టీడీపీ చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ఎండకట్టారు. చాలా మంది పైన అక్రమ కేసులు పెట్టిన భయపడకుండా వైసీపీ వెన్నంటే ఉన్నారు. డీఎంవో టీం లో ఉండే ప్రతి ఒక్కరితో రోజు మీటింగ్ పెడుతూ రివ్యూ చేసి ఇంప్రూవ్ చేసేవారు.

దివ్యారెడ్డి తో పాటు డీఎంవోలో ఉండే అందరూ రాత్రీపగలు శ్రమించారు. సెలవులు పండుగలు లేకుండా శ్రమించారు. ఎల్లో మీడియా ట్రిక్స్ అన్నింటిని అడ్డుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఎల్లో మీడియా వర్సెస్ సోషల్ మీడియా లాగా తయారు చేశారు. న్యూట్రల్ గా ఉన్న ఓటర్లు కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రచారానికి టర్న్ అయ్యారు. టీడీపీకి వ్యతిరేకంగా.. వైసీపీకి అనుకూలంగా మారారు.

దివ్యారెడ్డి, డీఎంవో టీం వల్ల సోషల్ మీడియాలో వైసీపీ దూసుకుపోయింది. ప్రచారంలో చాలా మందిని ఆకట్టుకుంది. ఒక్క మహిళ ఈ విజయం వెనుక కారణం. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి గల కారణాలపై సక్సెస్ స్టోరీ కనుక రాస్తే అందులో ఖచ్చితంగా దివ్యారెడ్డి కృషికి ఒక పేజీ ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. దివ్యారెడ్డి లేకుండా ఉంటే వైసీపీ సోషల్ మీడియా ఇంత ధృడంగా ఉండేది కాదనేది ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్న మాట.