Begin typing your search above and press return to search.

దిశ ఎన్ కౌంటర్.. ఇరుక్కున్న పోలీసులు

By:  Tupaki Desk   |   12 Dec 2019 7:30 AM GMT
దిశ ఎన్ కౌంటర్.. ఇరుక్కున్న పోలీసులు
X
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను దేశవ్యాప్తంగా అందరూ హర్షించారు. తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. అంతా బాగానే నడిచింది. కానీ ఇప్పుడు ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఇప్పటికే మానవ హక్కుల సంఘాలు ఎన్ కౌంటర్ ఫేక్ అంటూ విచారణ జరుపుతున్నాయి. పలువురు ప్రజా సంఘాలు, మేధావులు, మహిళా సంఘాలు హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎన్ కౌంటర్ బూటకమని పిటీషన్లు వేశాయి. దీనిపై లోతుగా విచారణ జరపడానికి సుప్రీం కోర్టు నిర్ణయించింది.

ఈ పరిణామాలకు తోడు తాజాగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఇతర రాష్ట్రాల పోలీసులతో విచారణ జరిపించాలని ఓయూ మాజీ ప్రొఫెసర్ రామ్ శంకర్ నారాయణ్ హైకోర్టు లో మరో సంచలన పిటీషన్ వేశారు. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ఎన్ కౌంటర్ బూటకమని మరో పిటీషన్ వేశారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై 302 కేసులు వేయాలని పేర్కొన్నారు. ఇక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని మరో పిటీషన్ దాఖలైంది.

ఇప్పటికే ఓ వైపు సుప్రీం కోర్టు, మానవ హక్కుల సంఘాల విచారణ తో తలబొప్పి కట్టిన పోలీసుల కు తాజాగా హైకోర్టు లో వరుసగా నమోదైన పిటీషన్లు శరాఘాతంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం , సీపీలు సజ్జనార్, మహేష్ భగవత్ సహా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మొత్తం 9మంది పోలీసులు ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు.