Begin typing your search above and press return to search.

కాలుష్యానికి కాదేదీ అనర్హం.... రోజూ పడేసే వ్యర్థాలతోనే అనర్థాలు

By:  Tupaki Desk   |   29 Nov 2021 2:30 AM GMT
కాలుష్యానికి కాదేదీ అనర్హం.... రోజూ పడేసే వ్యర్థాలతోనే అనర్థాలు
X
ఈ విశ్వం అంతటిలో జన జీవనానికి అనుకూలంగా ఉండే గ్రహం ఏదైనా ఉంది అంటే అది భూమి మాత్రమే. అయితే ఈ భూమిని మనం రకరకాల కాలుష్యాల ద్వారా సర్వనాశనం చేస్తున్నాము. మనం రోజూ వాడే ఎన్నో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను భూమిలో కలిపి కాలుష్యానికి బాటలు వేస్తున్నాము. అయితే ఈ కాలుష్యం అంతకంతకూ పెరిగి పోవడం వల్ల భూమిలో అనేక అనేక మార్పులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా జనజీవనం ప్రమాదం లో పడుతుంది. దీనిపై ఇప్పటికే ఎంతోమంది అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కానీ మానవుని జీవన శైలి లో అంతర్భాగంగా ఉండిపోయిన ఈ ప్లాస్టిక్ అనేది మానవుడికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్ భూమిలో పూర్తి స్థాయిలో కలవడానికి కొన్ని ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల భూమి లో ఉన్నటువంటి పొరలు దెబ్బతిని కాలుష్యానికి దారి తీస్తున్నాయని పర్యావరణ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం వేసిన చెత్త కేవలం భూమి మీద మాత్రమే కాకుండా అది చెరువుల్లోనూ నదుల్లో సముద్రంలో కలిసి కాలుష్యాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. దీని ద్వారా భూమిపై ఉండే జంతువులు మాత్రమే కాకుండా సముద్రంలో ఉండే అరుదైన జీవరాసులు కూడా అంతరించిపోతున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. వినియోగం మరింత ఆందోళనకు దారి తీస్తుంది. ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆచరణలో మాత్రం అవి అమలు కావడం లేదు. ఫలితంగా కాలుష్యం మరింత పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మానవాళిని నుంచి తప్పించేందుకు శాస్త్రవేత్తలు చెప్పినా ఏకైక సూత్రం ఏమిటంటే రీయుసబుల్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలి. దీని ద్వారా కొంత మేరకు పర్యావరణాన్ని రక్షించండి అని చెప్తున్నారు. అయితే మనం వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలవడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో ఓ సారి మనం కూడా తెలుసుకుందాం.

మిల్క్ పాకెట్, మిల్క్ కార్టెన్, టెట్రా కప్పు భూమిలో కలవడానికి సుమారు ఐదేళ్లు పడుతుంది. గ్లాస్ బాటిల్ భూమిలో కలవడానికి ఏకంగా లక్షల ఏళ్ళు పడుతుంది. ఇది ఇలా ఉంటే అల్యూమినియం క్యాన్ పుడమిలో కలిసిపోయేందుకు 100 నుంచి 800 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే భూమిని మనం చనిపోయిన తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు నాశనం చేస్తామని స్పష్టమవుతుంది. ఆఖరికి మనం కూలింగ్ తాగినప్పుడు అందులో వేసుకున్నా ప్లాస్టిక్ స్ట్రా కూడా భూముల కలిసేందుకు 200 ఏళ్ల పైన పడుతుందంటే అతిశయోక్తి కాదు ఆఖరికి యాపిల్ తొక్కు భూమిలో కలవాలంటే కనీసం రెండు నెలల సమయం తీసుకుంటుంది. ఇలా చూస్తే పర్యావరణానికి మనం రోజు వారి చేసే పనులు కూడా పెద్ద నష్టాన్ని కలిగిస్తుందని స్పష్టమవుతుంది. ఇంట్లో ఉపయోగించే ప్లైవుడ్ కూడా భూముల కలిసేందుకు మూడేళ్ల సమయం ఖచ్చితంగా తీసుకుంటుంది. దీంతో పాటు తాగి పడేసే కాఫీ కప్పు కూడా 30 ఏళ్ల సమయం తీసుకొని పుడమిలో అవుతుంది.. దీని ప్రకారం చూస్తే భూమి పాడు చేసేందుకు మానవజాతి తనకు తానే గుంత తీసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.