Begin typing your search above and press return to search.

క‌ష్ట‌ప‌డి.. బాబును ఇష్ట‌ప‌డే టీడీపీ మాజీ మంత్రికి ఎన్ని క‌ష్టాలు ?

By:  Tupaki Desk   |   30 July 2021 12:30 AM GMT
క‌ష్ట‌ప‌డి.. బాబును ఇష్ట‌ప‌డే టీడీపీ మాజీ మంత్రికి ఎన్ని క‌ష్టాలు ?
X
టీడీపీకి చెందిన మాజీ మంత్రి మంచి దూకుడు మీద ఉన్నారు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల విష‌యంలో ఆయ‌న తూ.చ‌. త‌ప్పకుండా న్యాయం చేయాల‌ని నిత్యం క‌ష్ట‌ప‌డుతున్నారు. ఎవ‌రో వ‌స్తారు..ఏదో చేస్తారు.. అని కూడా ఆయన ఎదురు చూడ‌డం లేదు. త‌న ప‌ద్ధ‌తిలో తాను దూకుడుగానే ఉంటున్నారు. కానీ, ఎంతైనా ఆత్మాభిమానం ఉంటుంది క‌దా! అదే ఇప్పుడు ఆయ‌న‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. తాను ఎంతో దూకుడుగా ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ ప‌రంగా నేతలు క‌లిసిరాక‌పోవ‌డం.. తాను ఎన్నిసార్లు ఫోన్లు చేసినా.. కీల‌క నేత‌లు స్పందించ‌క‌పోవ‌డం.. వంటివి ఆయ‌న‌కు ఇబ్బందిగా మారాయ‌ని అంటున్నారు.. ఆయ‌న అనుచ‌రులు.

దీంతో స‌ద‌రు మాజీ మంత్రి తీవ్ర మాన‌సిక ఇబ్బంది ప‌డుతున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు గుస‌గుస‌లాడుతున్నారు. విష‌యం లోకి వెళ్తే.. మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి శ్యామ్యూల్ జ‌వ‌హ‌ర్‌.. 2014లో రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ టీచ‌ర్‌గా ఉన్న జ‌వ‌హ‌ర్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా.. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి నిల‌బెట్టి.. గెలిపించుకుని.. త‌ర్వాత సెకండ్ ట‌ర్మ్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చంద్ర‌బాబు ఆయ‌న‌కు.. మంత్రి ప‌దవి కూడా ఇచ్చారు. దీంతో పార్టీ అంటే.. పార్టీ అధినేత అంటే.. జ‌వ‌హ‌ర్‌కు వ‌ల్ల‌మాలిన అభిమానం. చంద్ర‌బాబుపై ఎవ‌రు ఏమైనా అన్నా.. విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా.. ఆయ‌న త‌ట్టుకోలేరు. వెంట‌నే కౌంట‌ర్లు ఇస్తుంటారు.

ఇదే పార్టీలో ఆయ‌న‌కు మంచి గుర్తింపు తీసుకువ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. రాజ‌మండ్రి పార్ల మెంటరీ పార్టీ.. ఇంచార్జ్‌గా చంద్ర‌బాబు ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ నియోజ క‌వ‌ర్గాల్లోనూ పార్టీని బ‌లోపేతం చేయ‌డం ఆయ‌న విధి. ఈ క్ర‌మంలో జ‌వ‌హ‌ర్ అక్క‌డే పాగా వేశారు. నిత్యం రాజ‌మండ్రి స‌హా.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ను చూస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రితోనూ నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. పార్టీ ఎలా బ‌లోపేతం చేయాల‌నే విష‌యంలో స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు.

అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేక ప‌నుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇంత వ‌ర‌కు జ‌వ‌హ‌ర్‌కు మంచి మార్కు లే ప‌డుతున్నాయి. అయితే.. స్థానికంగా మాత్రం.. ఆయ‌న‌కు నాయ‌కులు క‌లిసిరావ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు..కేవ‌లం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరులోనే వ్య‌తిరేక‌త ఏర్ప‌డితే.. ఇప్పుడు రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు కూడా తోడ‌య్యాయి. ఇక్క‌డ ఆయ‌న ఏ కార్య‌క్ర‌మం చేయాల‌న్నా.. నాయ‌కులు వ‌స్తారో.. రారో.. అనే బెంగ ప‌ట్టుకుంటోంది. ఎందుకంటే.. సిటీ ఎమ్మెల్యే, రూర‌ల్ ఎమ్మెల్యేలు ఇద్ద‌రూ కూడా జ‌వ‌హ‌ర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌ని అంటున్నారు.

దీంతోమిగిలిన నాయ‌కులు కూడా జ‌వ‌హ‌ర్‌ను లెక్క‌చేయ‌డం లేదు. దీంతో వ‌చ్చిన కొద్దిమందితోనే తాను కార్య‌క్ర‌మాన్ని ముగించాల్సి వ‌స్తోంద‌ని.. జ‌వ‌హ‌ర్ అనుచ‌రులు చెబుతున్నారు. మ‌రో విచిత్రం ఏంటంటే ఆయ‌న కొవ్వూరు ఇన్‌చార్జ్ ప‌గ్గాలు త‌న‌కు ఎప్పుడు ఇస్తారా ? అని చూస్తున్నా బాబు మాత్రం స్థానికంగా ఉన్న క‌మ్మ నేత‌ల‌కు త‌లొగ్గి దీనిపై ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు. ఇలా జ‌వ‌హ‌ర్ బాబును ఇష్ట‌ప‌డుతూ... పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నా ఆయ‌న‌కు నేత‌లు క‌లిసి రాక ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.