Begin typing your search above and press return to search.

వైరల్‌ అవుతున్న 1980 నాటి 'దీదీ' ఫొటో..!

By:  Tupaki Desk   |   3 May 2021 2:30 PM GMT
వైరల్‌ అవుతున్న 1980 నాటి దీదీ ఫొటో..!
X
దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కి ఎదురొడ్డి నిలిచి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ప్రచారంలో టీఎంసీతో పోటీపడి నువ్వా నేనా అన్న రీతితో పోటీపడిన బీజేపీ ఫలితాలు మాత్రం ఆశించిన మేర అందుకోలేకపోయింది. ముఖ్యంగా ‘దీదీ ఓ దీదీ నీతో పాటు నీ పార్టీని కూడా బెంగాల్‌ ప్రజలు సాగనంపుతారం’ టూ ఎద్దేవా చేసిన ప్రధాని మోదీని తిరుగులేని దెబ్బ కొట్టారు. 2016 కంటే కూడా ఎక్కువ స్థానాలను సొంతం చేసుకున్నారు. 2021 ఎన్నికల్లో మమతా నేతృత్వంలోని టీఎంసీ పార్టీ రాష్ట్రంలో పూర్తి మెజారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగిన నందిగ్రామ్ ఓట‌మిని లైట్ తీసుకున్న ఆమె ముచ్చ‌ట‌గా మూడోసారి అధికార పీఠం ఎక్క‌ బోతున్నారు. కాగా టీఎంసీ అద్భుత విజయంతొ రియల్‌ ఫైటర్‌ మమతా బెనర్జీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒంటికాలితో విజయాన్ని అందుకున్న బెంగాల్‌ బెబ్బులి, కలకత్తా కాళి, అంటూ నెటిజన్లు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆమె గెలుపు దాదాపు ఖాయమైన తర్వాత 1980 నాటి మమతా బెనర్జీ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ట్విటర్‌లో ఇండియన్‌హిస్టరీపిక్స్‌ అనే హ్యాండిల్‌ ఈ ఫోటోను పోస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె ఆకాశానికెత్తుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందిరాగాంధీ తర్వాత భారత రాజకీయాలను శాసించిన మహిళ మమతా బెనర్జీనే అంటూ కామెంట్లు పెడుతున్నారు