Begin typing your search above and press return to search.

రవిప్రకాష్ కేసులో ట్విస్ట్.. ఎక్కడున్నాడంటే.?

By:  Tupaki Desk   |   19 May 2019 9:04 AM GMT
రవిప్రకాష్ కేసులో ట్విస్ట్.. ఎక్కడున్నాడంటే.?
X
ఫొర్జరీ, డేటా చోటీ చేసిన కేసులో ఇరుకున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ దేశం దాటినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. టీవీ9లో డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ, డేటా చోరీతోపాటు రూ.99వేలకే టీవీ9 లోగోలు అమ్మేసినట్లు రవిప్రకాష్ పై అసోసియేటేడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయినా రవిప్రకాష్ హాజరు కాకపోవడతో తాజాగా లుక్ ఔట్ నోటీసులు జారి చేసినట్లు తెలిసింది.

కొద్దిరోజులుగా రవిప్రకాష్ కోసం గాలిస్తున్న పోలీసులు ఆయన కదలికలపై నిఘా పెట్టారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లోని రవిప్రకాష్ ఉంటున్న ఇంట్లోకి వచ్చినట్టు సమాచారం. అక్కడికి వెళ్లేలోగానే పరారైనట్టు తెలిసింది. ప్రస్తుతం రవిప్రకాష్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు సమాచారం. ఇక ఇదే కేసులో కేసులు నమోదైన నటుడు శివాజీ కోసం కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

ఇక టీవీ9 లోగోలను , ట్రేడ్ మార్క్ లను అక్రమంగా రవిప్రకాష్ బదలాయిండన్న కేసులో మీడియా నెక్స్ ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు కూడా నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఆ సంస్థ అధినేత హరికిరణ్ చెరెడ్డిపై కేసు నమోదైంది. శనివారం ఆయన బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు. తాను ఎప్పుడు పిలిచినా వస్తానని లిఖితపూర్వకంగా పోలీసులకు లేఖ అందించారు.

*రవిప్రకాష్ అడ్వకేట్ ఇంట్లో సోదాలు

టీవీ9 వాటాల వ్యవహారంలో ఇరుకున్న రవిప్రకాష్ పై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. కాగా ఆయనకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై రవిప్రకాష్ అడ్వకేట్ జె.కనకరాజ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేశారు. కీలక సాక్ష్యాలను సేకరించినట్టు సమాచారం.

*శివాజీకి వడదెబ్బతో విశ్రాంతి

ఇక రవిప్రకాష్ తోపాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు శివాజీ తాజాగా వీడియో విడుదల చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొని వడదెబ్బతో విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ పోలీసులు, నాయకులతోపాటు ఏపీ నాయకులపై పలు ఆరోపణలు చేసిన శివాజీ తాను ఎక్కడ ఉన్నది మాత్రం వీడియోలో వెల్లడించలేదు.