Begin typing your search above and press return to search.

14 ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మొబైల్ తో పారిపోయిన డెలివరీ బాయ్ ...ఎలా పట్టుకున్నారంటే !

By:  Tupaki Desk   |   21 Nov 2020 11:30 PM GMT
14 ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మొబైల్ తో పారిపోయిన డెలివరీ బాయ్ ...ఎలా పట్టుకున్నారంటే !
X
స్మార్ట్ ఫోన్ అనగానే ప్రపంచ వ్యాప్తంగా అందరికి మొదటగా గుర్తుకువచ్చేసి యాపిల్. ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరలకే మర్కెట్స్ లో లభిస్తున్నప్పటికీ , యాపిల్ మొబైల్ కి ఉండే ఆ ప్రత్యేకతే వేరు. అదొక బ్రాండ్. యాపిల్ ఇటీవలే ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్. దీనితో పాటుగా అత్యంత ఖరీదైన ఫోన్. దీంతో పాటు వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒక డెలివరీ బాయ్ 14 ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లు తీసుకుని పారిపోయిన సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనా షిప్‌ మెంట్ కంపెనీ లో పనిచేసే టాంగ్ అనే వ్యక్తి 14 కొత్త ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ యూనిట్లను యాపిల్ అధికారిక స్టోర్ నుంచి ఇతర యాపిల్ స్టోర్ల నుంచి తీసుకురావాల్సి ఉంది. అయితే టాంగ్ వాటిని తీసుకుని పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ 14 ఐఫోన్లను తీసుకున్నాక ఆర్డర్లను క్యాన్సిల్ చేశాడు. ఈ ఆర్డర్‌ ను నవంబర్ 14వ తేదీన చేశారు. టాంగ్ వాటిని గుయాంగ్ యాపిల్ స్టోర్ నుంచి తీసుకున్నాడు. అయితే ఆ వెంటనే ఆ ఫోన్ల ను తీసుకోని అక్కడి నుండి పారిపోయాడు. ఏకంగా 14 ఐఫోన్లతో పారిపోవడంతో అతడిని పట్టుకోవడానికి యాపిల్ ఉద్యోగులు మాస్టర్ ప్లాన్ వేశారు.

అతను నాలుగు ఐఫోన్లను ఓపెన్ చేశాడు. వీటిలో ఒకదాన్ని వ్యక్తిగతంగా ఉపయోగిస్తూ ఉండగా, మిగతా మూడిటిని అత్యంత తక్కువ ధరకు విక్రయించాడు. అతను ఉపయోగించే ఫోన్‌ను ట్రాక్ చేయడం ద్వారా పోలీసులు టాంగ్‌ ను పట్టుకున్నారు. ఆ తర్వాత మరో మూడు ఫోన్లను రికవరీ చేశారు.