Begin typing your search above and press return to search.

160 కేజీల గంజాయి పట్టి 1 కేజీ చూపించారు.. పోలీసుల సస్పెన్షన్

By:  Tupaki Desk   |   28 Sep 2020 5:00 PM GMT
160 కేజీల గంజాయి పట్టి 1 కేజీ చూపించారు.. పోలీసుల సస్పెన్షన్
X
కొందరి పోలీసుల తీరు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లంచానికి లొంగిన కొందరు పోలీసులు డ్రగ్ డీలర్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకొని కోర్టులో మాత్రం 1 కేజీ అంటూ చూపించడం దుమారం రేపింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఇటీవల ఢిల్లీలోని జహంగీర్ పురీ పోలీసులు స్థానిక డ్రగ్ డీలర్ ఇంటిపై దాడి చేసి 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కానీ రిపోర్టులో మాత్రం కేజీ గంజాయి మాత్రమే దొరికిందని ఎఫ్ఐఆర్ లో రాసి కోర్టుకు చూపించారు.

విషయం ఏంటని ఉన్నతాధికారులు ఆరాతీయగా 159 కేజీల గంజాయిని వాళ్లే అమ్మేసుకున్నారని తెలిసింది. ఇక తరువాత 1.50 లక్షల లంచం తీసుకొని ఆ డ్రగ్ డీలర్ ని కూడా వదిలిపెట్టినట్టు తెలిసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నలుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

ఇక ఢిల్లీలోనే కాదు.. హైదరాబాద్, అస్సాంలోనూ ఈ గంజాయి, డ్రగ్స్ భారీగా పట్టుబడుతోంది. కోట్ల విలువైన మత్తు పదార్థాలు పోలీసులకు చిక్కుతున్నాయి. ఈ దందాను దేశవ్యాప్తంగా అరికట్లాల్సిన అవసరం ఉంది.