దిల్లీ నిరసనల్లో హింస..రాళ్ల వర్షం

Sun Feb 23 2020 20:21:41 GMT+0530 (IST)

Delhi Metro closes entry, exit gates of Jaffrabad station

సీఏఏ వ్యతిరేకత నిరసనలతో అట్టుడుకుతున్న దేశ రాజధాని దిల్లీలో మరో ప్రాంతం నిరసనలకు కేంద్రంగా మారింది. ఇంతవరకు షాహీన్ బాగ్‌లో నిత్యం నిరసనలు జరుగుతుండగా శనివారం కొత్తగా ఈశాన్య దిల్లీలోని జఫ్రాబాద్ వద్ద ఆందోళనలు మొదలయ్యాయి. వేలాది మంది మహిళలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరి నిరసన కారణంగా ఆదివారం ఉదయం మెట్రో స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డుపై ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు.. పోలీసులు నిరసనకారులతో చర్చలు ప్రారంభించారు.అయితే ఆదివారం సాయంత్రానికి ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. నిరసనకారులపై కొందరు రాల్లు విసిరారు. ప్రతిగా ఆందోళనకారులు కూడా రాళ్లు రువ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వారిని చెదరగొట్టడానికి ఢిల్లీ పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఫలితంగా- తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

00 మందికి పైగా ఆందోళనకారులు షహీన్ బాగ్ తరహాలో జఫ్రాబాద్ మెట్రో రైల్వేస్టేషన్ సముదాయం కింద శనివారం అర్ధరాత్రి నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. దోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలుగా ప్రయత్నించారు. సాయంత్రం 5 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆందోళనకారులపై రాళ్లు రువ్వవారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జీ చేశారు. లాఠీ ఛార్జీ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. కాగా ఘర్షణలకు కారణమని భావిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారు.