తాను చనిపోయి ఏడుగురి జీవితాలకు వెలుగునిచ్చిన మహిళ..

Wed Dec 08 2021 13:03:52 GMT+0530 (IST)

Dead Victim Turns Saviour To Others Donates 7 Organs

తాను చనిపోయినా ఇంకొకరు బతికి ఉండాలనే దయా హృదయం కొందరికే ఉంటుంది. తన అవయవాలతో వేరొకరికి ప్రాణం ప్రోసేందుకు ఇటీవల చాలా మందికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కళ్లు ఇతర అవయవాలు తాము చనిపోయిన తరువాత ఇచ్చేందకు ఒప్పందం చేసుకుంటున్నారు.కానీ 23 ఏళ్ల యువతి తను మరణిస్తే తనలో అసవరముండే అవయావలన్నీ తీసుకోవాలని తెలిపింది. దీంతో ఆమె ఇటీవల బ్రెయిన్ డెడ్ తో మరణించగా తన శరీరంలో 7 రకాల అవయవాలను సేకరించారు. ఆమె చనిపోయినా ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిందని అంటున్నారు.

హైదరాబాద్లో ఈనెల 2న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై భార్య భర్తలు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఇందులో భర్త ప్రాణాలతో బయటపడగా.. భార్య బ్రెయిన్ డెడ్ తో చనిపోయింది. అయితే యాక్సిడెంట్ కు గురైనా అవయావలన్నీ బాగానే ఉన్నాయి.

దీంతో వైద్యులు పరీక్షించిన తరువాత 7 అవయవాలు వేరొకరికి అమర్చే విధంగా ఉపయోగపడుతాయని గుర్తించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యలు వాటిని దానం చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తరువాత ఆ మహిళ నుంచి 7 రకాల అవయవాలను తీశారు.

అనుకోని ప్రమాదంలో తమ అమ్మాయి మరణించినందుకు బాధపడినా.. ఆమె అవయవాలు ఇతరులకు ఉపయోగపడుతున్నందుకు సంతోషించారు. అయితే ప్రతి ఒక్కరు తమ అవయవదానానికి ముందుకు రావాలని కొందరుపిలుపు నిస్తున్నారు.

పుట్టుకతోనో.. ఇతర కారణాల వల్లోనే కొన్ని అవయవాలు కోల్పోయిన వారు తమ జీవితంలో నరకం అనుభవిస్తారు. ఇలాంటి అవయవదానం వల్ల వారి జీవితాల్లో వెలుగు నింపినట్లవుతుందని అభిప్రాయ పడుతున్నారు.

గతంలో నేత్రదానం మాత్రమే చేసేవారు.. రాను రాను అవయవదానానికి ముందుకు వస్తున్నారు. కొందరు ముందే ఒప్పందం చేసుకొనగా.. మరికొందరు చనిపోయిన తరువాత వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకువస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు అవయవ దానం చేసి ఇతరు జీవితాలకు సాయం చేయాలని కోరుతున్నారు.