Begin typing your search above and press return to search.

బాల్‌ ట్యాంపరింగ్‌ పై వార్నర్​ పుస్తకం.. నిజాలన్నీ బయటకొస్తాయా?

By:  Tupaki Desk   |   29 Oct 2020 6:15 AM GMT
బాల్‌ ట్యాంపరింగ్‌ పై వార్నర్​ పుస్తకం.. నిజాలన్నీ బయటకొస్తాయా?
X
బాల్‌ ట్యాంపరింగ్‌పై డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ పుస్తకం తీసుకున్నాడు. ఓ పుస్తకం ద్వారా వార్నర్​పై పడ్డ తొలగించుకోవడంతో పాటు నిజాలన్నీ బయటకు వస్తాయని వార్నర్​ సతీమణి క్యాండిస్‌ వార్నర్‌ తెలిపారు. 2018లో క్రికెట్​ ఆస్ట్రేలియాను బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కుదిపేసింది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్‌ ఆటగాళ్లు స్మిత్‌ (అప్పటి కెప్టెన్‌), వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ కేప్‌టౌన్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. ఈ ఉదంతం ఆటగాళ్ల కెరీర్‌కు మచ్చగా నిలిచింది. అయితే ఈ వివాదంపై ప్రధానంగా వార్నర్​పైనే ఆరోపణలు వినిపించాయి. అయితే దీనిపై వాస్తవాల్ని వివరించేందుకు తన భర్త పుస్తకం రాస్తాడని క్యాండిస్‌ తెలిపింది. బంతిని ఉద్దేశపూర్వకంగా మార్చాలనే ప్రణాళిక వార్నర్​ది కాదని ఆమె పేర్కొన్నది.

కొందరు ఉద్దేశ్య పూర్వకంగా తన భర్తను ఇరికించారని చెప్పుకొచ్చింది. పుస్తకం బయటకొస్తే నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపింది. వార్నర్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్క్‌సిన్‌ కూడా పుస్తకంలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని, తప్పకుండా వార్నర్‌ సమీప భవిష్యత్తులో వాస్తవాలతో పుస్తకం రాస్తాడని చెప్పారు. ఈ పుస్తకం బయటకొస్తే ఆస్ట్రేలియా క్రికెట్​ చరిత్రలో ఎన్నో కొత్తవిషయాలు బయటకొస్తాయని జర్నలిస్టులు, క్రికెట్​ అభిమానులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదంలో వార్నర్‌, స్మిత్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోగా, బాన్‌ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది.