కన్నకూతురితోనే.. పోక్సో చట్టంకింద మాజీ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్

Mon Jul 26 2021 21:00:02 GMT+0530 (IST)

Former MLA son arrested under Pokso Act

రాను రాను ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. కన్నతండ్రి పిల్లలకి భరోసాగా నిలబడాల్సింది పోయి వారిపైనే అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి. కన్నబిడ్డలపైనే అసభ్యంగా ప్రవర్తించే ఆ తండ్రి ఇక సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడో ఉహలకే వదిలేయాలి. కన్నకొడుకు కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతనికి రిమాండు విధించింది. దీనితో ప్రస్తుతం అతడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే... వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు జూబ్లీహిల్స్ రోడ్ నెం.70లో నివాసం ఉంటాడు. అతడికి 2003లో వెంకటగిరికి చెందిన మహిళ తో వివా హం జరిగింది. అమెరికాలో ఉండే ఈ దంపతులు 2010లో నగరానికి తిరిగి వచ్చారు. వీరికి 14 ఏళ్ల కూతురు 11 ఏళ్ల  కొడుకు ఉన్నారు. 2018లో కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. భర్తతో వేరుగా ఉంటున్నప్పటి నుంచి పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చింది. 11 ఏళ్ల కుమారుడు14 ఏళ్ల కుమార్తె ఎప్పుడూ దిగులుగా ఉంటున్నారు. దీంతో తల్లి వారిని ఓ సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లి చూపించింది. సైకాలజిస్ట్ వారిని కౌన్సెలింగ్ చేస్తున్న సమయంలో 14 ఏళ్ల కుమార్తె సంచలన విషయాలు వెల్లడించింది.

తన తండ్రి గతంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. తన తండ్రి ముందే అతని స్నేహితుడు సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అయినప్పటికీ తన తండ్రి అతన్ని ఏమీ అనేవాడు కాదని చెప్పింది. ఇక  తనను నగ్నంగా చేసి అసభ్యంగా ప్రవర్తించేవాడని కుమారుడు చెప్పుకొచ్చాడు. ఈ విషయం గురించి తెలిసిన తల్లి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ నిందుతుడు ఎమ్మెల్యే తనయుడు అని వార్తలు ప్రచారం అవుతున్నప్పటికీ అయన ఎవరు అన్నది మాత్రం పోలీసులు బయటకి చెప్పలేదు. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.